Best Web Hosting Provider In India 2024
లలలలలMr and Mrs Mahi box office: జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ గత శుక్రవారం (మే 31) రిలీజైన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ రావ్ కూడా నటించిన ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే తొలి మండే పరీక్షలో మాత్రం ఫెయిలైంది. నాలుగో రోజైన సోమవారం (జూన్ 3) ఈ సినిమా కలెక్షన్లు పడిపోయాయి.
మిస్టర్ అండ్ మిసెస్ మహి కలెక్షన్లు
జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల మార్క్ అందుకునేందుకు చేరువైంది. నాలుగో రోజు ఈ మూవీ కలెక్షన్లు కాస్త తగ్గాయి. సోమవారం (జూన్ 3) ఈ సినిమా రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గత శుక్రవారం రిలీజ్ కాగా.. తొలి రోజే రూ.6.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ ఈ మూవీ ఒక రోజు అత్యధిక కలెక్షన్లు అవే.
తర్వాత రెండో రోజైన శనివారం కలెక్షన్లు రూ.4.6 కోట్లకు పడిపోగా.. మూడో రోజైన ఆదివారం రూ.5.5 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో తొలి నాలుగు రోజులు కలిపి రూ.19 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. గతంలో 2021లో రూహి మూవీలో జాన్వీ, రాజ్ కుమార్ రావ్ కలిసి నటించగా.. ఇప్పుడు రెండోసారి వీళ్లు స్క్రీన్ పై కనిపించారు. శరణ్ శర్మ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.
గతంలో గుంజన్ సక్సేనా సినిమా కోసం కూడా జాన్వీ, శరణ్ కలిసి పని చేశారు. ఆ సినిమా కూడా జాన్వీ కెరీర్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడీ మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా బాక్సాఫీస్ హిట్ అని చెప్పాలి.
మిస్టర్ అండ్ మిసెస్ మహి స్టోరీ ఏంటంటే?
జాన్వీ, రాజ్ కుమార్ రావ్ కలిసి నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి తొలి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ లో నడిచే సినిమా ఇది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఫిలాసఫీతో సాగే సినిమా తమదని గతంలో జాన్వీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కూడా తాను చాలాసార్లు గాయపడినట్లు ఆమె తెలిపింది.
మహేంద్ర (రాజ్‍కుమార్ రావ్).. తన భార్య మహిమ (జాన్వీ కపూర్)లోని క్రికెట్ టాలెంట్‍ను గుర్తిస్తాడు. క్రికెట్‍లో కలలను నేరవేర్చుకునేందుకు ఆమెకు మహేంద్ర కోచింగ్ ఇవ్వడం చుట్టూ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం నడుస్తుంది. మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రాన్ని జీ స్టూడియోస్‍తో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమాలో రాజ్‍కుమార్ రావ్, జాన్వీతో పాటు రాజేశ్ శర్మ, కుముద్ మిశ్రా, అభిషేక్ బెనర్జీ కీలకపాత్రలు చేశారు.
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తో కలిసి ఆర్సీ16లోనూ ఆమె నటిస్తోంది.