Murali Mohan: డబ్బులున్నంత మాత్రానా హీరో అవలేరు.. నటుడు మురళి మోహన్ షాకింగ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Murali Mohan About Heroes: హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓసి. ఈ సినిమాకు విష్ణు బొంపెల్లి దర్శకత్వం వహించగా.. కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇటీవల ఓసీ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్రపరిశ్రమ నిర్మాత, నటుడు, సీనియర్ హీరో మురళి మోహాన్‌తోపాటు పలువురు రాజకీయవేత్తలు హాజరు అయ్యారు.

ఓసీ మూవీ మొదటి టికెట్‌ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసి, ఫస్ట్ టికెట్ ఆయనే తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మురళి మోహన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “డబ్బులున్నంత మాత్రానా హీరో అవలేరు. దానికి ఎంతో శ్రమ, పట్టుదలతో పాటు అదృష్టం కూడా ఉండాలి” అని మురళి మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఓసీ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది అని మురళి మోహన్ కొనియాడారు. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాతలతో పాటు పనిచేసిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మధ్య చిన్న, పెద్ద సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ కథ, కంటెంట్ ఉన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతున్నాయని పేర్కొన్నారు. తెలుగు పరిశ్రమ వైపు ఈరోజు ప్రపంచమే చూస్తోంది, మంచి మంచి కథలతో కొత్త ఆలోచనలతో యువకులు ముందుకు రావాలి అన్నారు.

అలాగే ఓసీ సినిమా ట్రైలర్ చూస్తేనే ఇలా ఉందంటే విడుదల తరువాత ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకంగా తెలిపారు మురళి మోహన్. ఇక ఓసీ అంటే ఏంటో తెలియాలంటే అందరితో పాటు తాను కూడా జూన్ 7 వరకు ఎదురు చూస్తా అని పేర్కొన్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆయనకు సినిమాకు మంచి సంబంధం ఉందని, ఆయనకు ఉన్న ఏకైక అలవాటు సినిమాలు చూడడమే అని తెలిపారు. ఆయన దరువు, రజాకార్ తరువాత ఇప్పుడు ఓసీ సినిమా వేడుకకే వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం డైరెక్టర్, హీరో తమ ప్రాంతం వారేనని, ఈ విషయంలో ఆయన గర్వపడుతున్నట్లు వెల్లడించారు.

చిత్ర పరిశ్రమలో విజయం సాధించాలంటే మాములు విషయం కాదని, ఎంతో టాలెంట్, ఓపిక ఉండాలని ఆ రెండు ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఉందని డైరెక్టర్, హీరోలను ఉద్దేశించి అభినందించారు. ఇలాగే వీరు మంచి చిత్రాలను చేయాలని, మరెందరికో స్పూర్తిగా నిలువాలని ఎమ్మెల్యే అన్నారు. ఇక ట్రైలర్ బాగుందని, కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని జూన్ 7న ఆయన సైతం థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తానన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ.. ఓసీ సినిమాను తెరకెక్కించిన కాస్ట్ అండ్ క్రూకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన జెయింట్ కిల్లర్ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమాణరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఓసీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లా ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది అని పేర్కొన్నారు.

ఇక కుటుంబం మొత్తం ఒక సినిమా కోసం ఇలా నిలబడడం చాలా ఉన్నతమైన విషయం అని పేర్కొన్నారు. సినిమా అంటేనే వందల మంది కలిసి పనిచేస్తారు. ఒక సినిమా విజయం సాధిస్తే చాలా మందికి విజయం చేకురుతుంది. ఉపాధి కలుగుతుంది అని ఓసీ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని మాజీ డీసీపీ తెలిపారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024