Brahmamudi June 5th Episode: బ్రహ్మముడి- కోమాలో మాయ- కావ్యలో మొదలైన భయం- బయటపడిన అనామిక దొంగ బుద్ధి- స్వప్న వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో యాక్సిడెంట్ అయిన అసలు మాయను కావ్య అప్పు హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లో మాయకు స్పృహ పోయిందని, ఎప్పుడు వస్తుందో చెప్పలేమని డాక్టర్స్ చెబుతారు. మాయ కోమాలోకి వెళ్లడంతో కావ్య షాక్ అవుతుంది. ఇప్పుడు దొంగ మాయతో భర్త రాజ్ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కాక కంగారుపడుతుంటుంది.

 

ఎవరు అర్థం కావట్లేదు

మరోవైపు కావ్య గురించి ఇందిరాదేవి, సీతారామయ్య ఆలోచిస్తుంటారు. స్వప్న వాళ్ల దగ్గరికి వస్తుంది. ఈ ఇంట్లో పరాయి వాళ్లు ఎవరో సొంత వాళ్లెవరో అర్థం కావట్లేదు అని స్వప్న అంటుంది. ఏమైనా అడగాల. ఈ ఇంట్లో కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడేది నువ్ ఒక్కదానివే అడుగు అని సీతారామయ్య అంటాడు. అలా మాట్లాడదామనే వచ్చాను. మీ అనుభవం ఎక్కువ అలాంటిది కావ్యకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అని స్వప్న అంటుంది.

అపర్ణ ఆంటీ చెప్పిందే శిలాశాసనం అని అందరం శిలా ప్రతిమల్లా ఉండిపోతే ఎలా అని స్వప్న అంటుంది. నువ్ అడుగుతుంది కరెక్టే. కానీ అడగాల్సినవాళ్లను అడగట్లేదు. నువ్ అపర్ణను అడిగితే నీకు సరైనా సమాధానం దొరుకుతుంది అని ఇందిరాదేవి అంటుంది. ఆవిడ నాకు చాలా సార్లు సపోర్ట్ చేశారు. నాకు ఆస్తి రాసిచ్చేటప్పుడు కూడా ఊరుకున్నారు. ఆమెతో నేను ముక్కు సూటిగా మాట్లాడలేను. ఆవిడ ఒక మీ మాట మాత్రమే వింటారు అని స్వప్న అంటుంది.

కావ్యకు శిక్ష పడటం

లాభం లేదమ్మా. చేయి దాటి పోయింది. మేము చెబితే వినే స్థాయి దాటిపోయిందమ్మ అని ఇందిరాదేవి అంటుంది. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపడం కష్టమైన పని కాదమ్మా. కానీ ఆ బిడ్డ భవిష్యత్ ఏంటీ. రాజ్ చేసిన తప్పుకు బిడ్డకు శిక్ష పడటం కరెక్ట్ కాదమ్మా అని సీతారామయ్య అంటాడు. కరెక్టే అలాగే రాజ్ చేసిన తప్పుకు కావ్యకు కూడా శిక్ష పడటం కరెక్ట్ కాదు కదా. ఎవరు ఏం చేయలేరని అర్థమైంది. వస్తాను అని వెళ్లిపోతుంది స్వప్న.

 

అప్పును కావ్య కలుస్తుంది. కారులో వెళ్దామని కావ్య అంటే మాయ పసిగట్టే అవకాశం ఉంది అని కావ్య అంటుంది. దాంతో డ్రైవర్‌కు చెప్పడానికి కారు దగ్గరికి వెళ్లినప్పుడు కారు అద్దంలో రాజ్ కారు కనిపిస్తుంది. దాంతో ఈయనేంటి నన్ను ఫాలో అవుతూ వచ్చారా. ఈయన సంగతి చెబుతానని అనుకుంటుంది కావ్య. అప్పు ఇప్పుడు మనం మాయ ఇంటికి వెళ్లడం లేదు. నీకో విషయం చెబుతాను. ఎటు తల తిప్పకుండా విను. వెనుకాల మీ బావగారు నన్ను ఫాలో అవుతూ వచ్చారు అని కావ్య అంటుంది.

అనామిక తండ్రి సూసైడ్

హో హో అదా సంగతి అని అప్పు అంటుంది. ఇప్పుడు వెంటనే మాయ ఇంటికి వెళ్లకూడదని అనుకుంటారు కావ్య అప్పు. వాళ్లను రాజ్ ఫాలో అవుతుంటాడు. మరోవైపు అనామికకు తన తల్లి కాల్ చేసి మాట్లాడుతుంది. ఆ ఫోన్ కాల్ రావడం విని స్వప్న విని అనామిక మాటలు వింటుంది స్వప్న. అనామిక తండ్రి సూసైడ్ చేసుకోబోతున్నారు అని తల్లి చెబుతుంది. ఏంటీ సూసైడా అని అనామిక షాక్ అవుతుంది.

తర్వాత ఏంటీ పది లక్షలా.. అంత డబ్బు ఎవరు అప్పు చేయమన్నారు. ఇంట్లో నాతో ఎవరు సరిగా మాట్లాడట్లేదు అనామిక అంటుంది. గంటలోపు డబ్బు ఇవ్వకపోతే మీ నాన్నను కొట్టడమే కాదు. పోలీస్ కేసు కూడా పెడతారని తన తల్లి చెబుతుంది. సరే గంట టైమ్ ఉందిగా. నేను ఏదోటి చేస్తాను అని అనామిక అంటుంది. దీనికి గంటలో పది లక్షలు ఎలా వస్తాయి. ఏం చేస్తుంది అని స్వప్న అనుకుంటుంది. కల్యాణ్ చెక్ మీద సంతకం చేసి పెట్టినట్లు ఫోన్ మాట్లాడింది గుర్తు చేసుకుంటుంది అనామిక.

 

ఏదో పారేసుకున్నట్లు

వెంటనే ఆ చెక్ బుక్ తీసి.. నా మొగుడు ఆఫీస్‌కు వెళ్లకపోయినా చెక్ పవర్ ఉంది కాబట్టి బతికిపోయాను అనుకుంటుంది అనామిక. ఇదేం చేస్తుందో చూద్దా అని స్వప్న అనుకుంటుంది. మరోవైపు రాజ్‌ను ప్రతి గల్లీ తిప్పుతుంటారు కావ్య అప్పు. తర్వాత ఒక చెట్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు కావ్య అప్పు. వారితోపాటు రాజ్ కూడా తిరుగుతాడు. తర్వాత ఏదో పారేసుకున్నట్లు వెనుకకు వెళ్తుంటారు. ఒక పిన్నీస్ పోగొట్టుకున్నట్లు, దాహం వేస్తుందని, పద వెళ్దామని అంటుంది కావ్య.

దాంతో ఇంతసేపు వెతికింది పిన్నీసు కోసమా. అది కూడా ఇంటి దగ్గర పొగొట్టుకుంది అని రాజ్ షాక్ అవుతాడు. తర్వాత కొబ్బరి బొండాలు తాగుతారు కావ్య, అప్పు. వీళ్లు తాగాక నేను కూడా తాగాలి దాహంగా ఉంది అనుకున్న రాజ్ డబ్బు ఉందా లేదా అని జేబులో చూస్తాడు. కానీ లేకపోవడంతో కారు కోసం వెళ్దామనుకుంటాడు. కానీ, కారు ఎక్కడ పెట్టానో అని రాజ్ మర్చిపోతాడు. తర్వాత రాజ్ జేబులో చాక్లెట్ ఉంటుంది. ఆ చాక్లెట్ పట్టుకుని స్కూల్ పాపకు ఇచ్చి వాటర్ అడగాలని అనుకుంటాడు.

చీర కొంగులో పెట్టుకుని

కానీ, ఆ పాప వాళ్ల అమ్మను పిలిచి పిల్లలను ఎత్తుకెళ్లి పోయేవాడు అని చెబుతుంది. దాంతో పాప తల్లి చుట్టు అందరిని పిలుస్తుంది. దాంతో రాజ్ పారిపోతాడు. మరోవైపు కల్యాణ్ సైన్ చేసిన చెక్ బుక్ పై పది లక్షలు రాస్తుంది అనామిక. అది చూసి దీనికి దొంగబుద్ధి కూడా ఉందా అని స్వప్న అంటుంది. పది లక్షలకు చెక్ రెడీగా ఉంది. డాడీ డ్రైవర్‌ను పంపిస్తాడని అన్నాడు. ఇంటికి రావొద్దని చెప్పండి. బయటే ఇస్తాను అని అనామిక తల్లికి కాల్ చేసి చెబుతుంది.

 

తర్వాత చీర కొంగులో చెక్ పెట్టుకుని వెళ్తుంది అనామిక. అది స్వప్న చూస్తుంది. అనామిక మెట్లు దిగుతుంటే కల్యాణ్‌కు గుద్దుకుంటుంది. ఎందుకింత కంగారుపడుతున్నావని కల్యాణ్ అడిగితే.. నీకు తగిలిందేనేమోనని అని అనామిక కంగారుగా వెళ్లిపోతుంది. చెబుతా నీ సంగతి అని స్వప్న ఫాలో అవుతుంది. మరోవైపు కావ్య, అప్పులను రాజ్ ఇంకా ఫాలో అవడం చూసి మన ప్లాన్ తలకిందులు చేసేలా ఉన్నారే అని కావ్య అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024