Best Web Hosting Provider In India 2024
AP TET Results: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మరో రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ విడుదల అయ్యాయి. అయితే ఫలితాలు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి.
మార్చి 13నే టెట్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీను రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే మార్చి 14 రాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ నుంచి ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. టెట్ పరీక్ష అర్హత సాధిస్తే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ వస్తుంది. అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.
ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల కావల్సిఉంది. కానీ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఏపీ టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్ పడింది. దీంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఫలితాలను బట్టీ డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
అయితే ఎన్నికల సంఘం పోలింగ్ అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ఫలితాలు విడుదల కాలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో ఏపీ టెట్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చూడొచ్చు.
డీఎస్సీ పరీక్షలకు కూడా ఎన్నికల కోడ్ అడ్డంకి
రాష్ట్రంలో 6,100 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో డీఎస్సీ పరీక్షలకు కూడా బ్రేక్ పడింది.
డీఎస్సీ పరీక్ష రోజుకు రెండు సెషన్ల చొప్పున పది సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషయన్సీ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
మార్చి 20 నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సింది. మార్చి 25 నుంచి అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎందుకంటే టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు మధ్య కాల వ్యవధి కనీసం నాలుగు వారాలు ఉండాలని సూచించింది.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్