Best Web Hosting Provider In India 2024
Venom 3 Trailer Released: మార్వెల్ సంస్థ సూపర్ హీరో సినిమాలకు పెట్టింది పేరు అని తెలిసిందే. కానీ, మార్వెల్ సంస్థ సహాకారంతో యాంటీ హీరో సినిమాలు కూడా తెరకెక్కాయి. అదే వెనమ్ ఫ్రాంఛైజీ. సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుంచి వస్తోన్న ఐదో సినిమానే వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ (వెనమ్ 3). వెనమ్ ఫ్రాంఛైజీ నుంచి ఇది మూడో సినిమా.
ఇటీవల ఈ వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్‌ను (వెనమ్ 3 ట్రైలర్) రిలీజ్ చేశారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథకు మూడో భాగంగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో మరోసారి వెనమ్ పాత్రలో టామ్ హార్డీ యాక్ట్ చేస్తున్నాడు. ఈ ట్రైలర్‌లో టామ్ అండ్ తనలోని రాక్షసుడు వెనమ్.. రౌడీలు, గ్రహాంతరవాసులతో ఫైట్ చేస్తూ కనిపించడం చూపించారు.
ఎడ్డీ బ్రాక్ (టామ్ హార్డీ) రౌడీలు ఉన్న చోటుకు వెళ్తాడు. తనలో ఉన్న వెనమ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూ తమ ప్రాణాలను కాపాడుకోమ్మని ఎడ్డీ బ్రాక్ హింట్ ఇస్తాడు. కానీ రౌడీలు వినకపోవడంతో వారితో ఫైట్ చేయడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. తర్వాత వెనమ్ కోసం తన గ్రహంలోని వ్యక్తులు రావడం, వారితో ఎడ్డీ బ్రాక్, వెనమ్ కలిసి ఫైట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
అంతేకాకుండా వెనమ్‌కు పోటీగా మరో విచిత్రపు జంతువును రంగంలోకి దించారు. ఆ సమయంలో దేవుడా అని వెనమ్ చెప్పే డైలాగ్ కామెడీగా ఉంది. వెనమ్‌కు ఆ ఏలియన్‌కు మంచి ఫైట్ ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఓ గుర్రంలోకి వెనమ్ దూరి ఫాస్ట్‌గా పరిగెత్తే సీన్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇది ట్రైలర్‌కే హైలెట్ అయిందని చెప్పుకోవచ్చు.
అయితే, వెనమ్ 3 సినిమాలో ఎడ్డీ బ్రాక్ వెనమ్ పుట్టిన గ్రహాంతర వాసులతో ఫైట్ చేయడం, వారి నుంచి ఎడ్డీ, వెనమ్ ప్రాణాలు కోల్పోవడం వంటి కథను చూపించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వెనమ్ సినిమా ఫ్రాంఛైజీకి సైతం మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నిజానికి స్పైడర్ మ్యాన్‌కు ఉన్న శత్రువులలో వెనమ్ ఒకరు. విలన్‌ను యాంటీ హీరోగా చూపిస్తూ ఈ సిరీస్ తెరకెక్కించారు. ముందుగా వెనమ్ మూవీ 2018లో వచ్చి మంచి హిట్ కొట్టింది.
ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా వెనమ్ లెట్ దేర్ బి కార్నెజ్ తెరకెక్కించారు. 2021లో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో రెండో సీక్వెల్‌గా, వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ మూవీ తర్వాత కథగా వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ వస్తోంది. ఈ వెనమ్ 3పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ (Sony Spider Man Universe/ SSU)లో ఇది ఐదో చిత్రం. స్పైడర్ మ్యాన్ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ యాంటీ హీరో సైన్స్ ఫిక్షన్ చిత్రానికి కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు. వెనమ్: ది లాస్ట్ డాన్స్ మూవీలో రైస్ ఇఫాన్స్, పెగ్గీ లూ, అలన్నా ఉబాచ్, స్టీఫెన్ గ్రాహం కీలక పాత్రల్లో నటించారు.
కొలంబియా పిక్చర్స్ అండ్ మార్వెల్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా అరాద్ ప్రొడక్షన్స్, మాట్ టోల్మాచ్ ప్రొడక్షన్స్, పాస్కల్ పిక్చర్స్, హచ్ పార్కర్ ఎంటర్టైన్మెంట్, హార్డీ, సన్ అండ్ బేకర్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక వెనమ్: ది లాస్ట్ డాన్స్ మూవీ అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రం వెనమ్ ఫ్రాంచైజీలో చివరి భాగం అని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే స్పైడర్ మ్యాన్‌కు వెనమ్ మధ్య సినిమాలను చూసే అవకాశం లేకుండా పోతుంది.
టాపిక్