Best Web Hosting Provider In India 2024
వేసవి నెలల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు మగవారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వారి పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా వారి వీర్య నాణ్యత, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. వేడి వాతావరణం పురుషుల సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవడం కోసం అధ్యయనాలు జరిగాయి. వేసవిలో వీర్యం కూడా వేడెక్కే అవకాశం ఉంది. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వీర్యం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం తేమవంతంగా ఉండడం చాలా అవసరం. వేడి ఉష్ణోగ్రతలు మగవారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోండి.
1. స్పెర్మ్ ఉత్పత్తి
స్పెర్మ్ ఉత్పత్తి అనేది ఒక సున్నితమైన ప్రక్రియ. ఇది ఉత్తమంగా పనిచేయడానికి నిర్దిష్ట ఉష్ణోగ్రత పరిధి అవసరం. ప్రధాన శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి వృషణాలు శరీరం వెలుపల ఉంటాయి. అయినప్పటికీ, వేడి వాతావరణంలో ఈ సమతుల్యతకు భంగం కలుగుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యత తగ్గడానికి దారితీస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రించే అవయవాలను ప్రభావితం చేస్తాయి.
2. స్పెర్మ్ కదలిక
స్పెర్మ్ వేడెక్కడం వల్ల వాటి చలనశీలతపై కూడా ప్రభావం పడుతుంది. అవి చురుకుగా ఉండవు. వీర్య కణాలు చురుకుగా లేకపోతే అండాన్ని చేరుకోవడం కష్టంగా మారుతుంది. దీని వల్ల ఫలదీకరణం జరగదు. కాబట్టి గర్భం ధరించడం కష్టంగా మారుతుంది.
3. హార్మోన్లలో మార్పులు
అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వాటి సంఖ్యను తగ్గిస్తుంది.
4. ఆక్సీకరణ ఒత్తిడి:
పెరిగిన ఉష్ణోగ్రతలు ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తాయి. స్పెర్మ్ డిఎన్ఎకు నష్టం కలిగిస్తాయి. స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తాయి. ఫలదీకరణం విజయవంతం అయ్యే రేటును ప్రభావితం చేస్తాయి.
అధిక వేడి వాతావరణంలో మగవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్పెర్మ్ నాణ్యత తగ్గకుండా ఉంటుంది.
1. చల్లని వాతావరణం: వేడినీటి స్నానాలు మానేయాలి. బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకూడదు. అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికాకుండా చూసుకోవాలి. ఎండగా ఉన్నప్పుడు ఇంటి లోపలే ఉండటం మంచిది. వదులుగా ఉండే లోదుస్తులు వీర్యం నాణ్యతను పెంచడానికి సహాయపడతాయి.
2. హైడ్రేట్ గా ఉండండి: సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో తగినంత తేమ కీలకం. ముఖ్యంగా వేడి వాతావరణంలో మగవారు పుష్కలంగా నీరు తాగాలి.
3. ఆహారం, సప్లిమెంట్స్: పండ్లు, కూరగాయలు వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్ వంటి సప్లిమెంట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి.
4. వ్యాయామం: మొత్తం ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. అయితే, వేడి వాతావరణంలో అధిక శారీరక శ్రమ శరీరంలో వేడిని పెంచేస్తుంది.
5. ధూమపానం, మద్యపానం: ధూమపానం, అధిక మద్యపానం… రెండూ మగ సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ అలవాట్లను మానుకుంటేనే మంచిది.
ఉష్ణోగ్రత-ప్రేరిత హార్మోన్ల మార్పులు, ఆక్సీకరణ ఒత్తిడి, బలహీనమైన స్పెర్మ్ ఉత్పత్తి, చలనశీలత వంటివి వీర్యం నాణ్యత తగ్గడానికి కారణం అవుతాయి. ఇది తీవ్రంగా పురుష సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వేసవిలో శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
టాపిక్