Best Web Hosting Provider In India 2024
Krishna mukunda murari serial today june 5th episode: మీరా గురించి ఎంక్వైరీ చేశానని అందరూ తన గురించి మంచిగా చెప్పారని భవానీ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. కృష్ణని నమ్మకుండా మీరా మంచిది కాదా అని సందేహ పడటం కరెక్ట్ కాదని మధు అంటాడు. మీరా గర్భవతి అని తెలిసింది కారణం ఎవరు అంటే మురారి అని చెప్పింది.
కృష్ణ అబద్ధాలు చెప్తుంది
మురారిని అడుగుదామని అంటే ఆ క్షణం నుంచి కనిపించకుండా పోయాడని భవానీ అంటుంది. కానీ కృష్ణ సరోగసి చేయించాము మీరా కడుపులో ఉన్న బిడ్డ మా బిడ్డ అంటుంది కదాని రేవతి అంటే కానీ డాక్టర్ సరోగసి చేయలేదని చెప్తుంది కదాని భవానీ అంటుంది.
మీరా డాక్టర్ ని మ్యానేజ్ చేస్తుందేమో అంటే నేను అలాగే అనుకుని ఎంక్వైరీ చేయడానికి వెళ్లానని చెప్తుంది. మీరా అబద్ధం చెప్పడం లేదు అంటే కృష్ణ అబద్ధం చెప్పిందని అంటున్నారా అని మధు అంటే మరి అంతే కదాని ఆదర్శ్ ఎంట్రీ ఇస్తాడు. మురారి కడుపు చేసి పారిపోయాడు భర్తని కాపాడుకోవడానికి కృష్ణ అబద్ధాలు చెప్తుంది.
అంతా క్లియర్ గా ఉంది. నిన్ను మోసం చేసింది మీరా అయితే కృష్ణ, మురారి మీద ఎందుకు కోపం చూపిస్తున్నావని మధు నిలదీస్తాడు. నన్ను మోసం చేసింది మీరానే కానీ అందుకు కారణం మురారి. నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది లేదంటే పిల్లల తల్లిని నాకు అంటగట్టే వాడు.
కృష్ణ అబద్ధం చెప్పదు
అమ్మకి కృష్ణ మీద అనుమానం ఉంది కాబట్టి మీరా గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిందని అంటాడు. నాకు కృష్ణ మీద అనుమానం ఉంటే తన గురించి ఎంక్వైరీ చేస్తాను కానీ మీరా మీద కాదుగా. ఎట్టి పరిస్థితిల్లోను మురారి తప్పు చేయడు, కృష్ణ అబద్ధం చెప్పదు నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది.
కానీ ముకుంద వైపు అన్ని నిజాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నమ్మకం, మరోవైపు నిజం రెండింటి మధ్య తేల్చుకోవడం కష్టం. కృష్ణ అబద్ధం చెప్పిందని అనుకుంటే మీరా కడుపులో ఉంది మురారి బిడ్డ కదా. పోనీ మీరా అబద్ధం చెప్తుంది అనుకుంటే అప్పుడు కూడా ఉంది మురారి, కృష్ణ బిడ్డే కదా.
ఏది నిజమో ఏది అబద్ధమో కానీ మీరా కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు. అందుకే కృష్ణ మాటల మీద నమ్మకం ఉన్నా కచ్చితంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నానని భవానీ అంటుంది. మీరా ఏది పిలవమని అడుగుతుంది. ఇంట్లో లేదు ఇందాక బయటకు వెళ్ళిందని ఆదర్శ్ చెప్తాడు.
శ్రీనివాస్ ని నిలదీసిన కృష్ణ
తను బయటకు ఎందుకు వెళ్ళింది, కృష్ణ వెళ్లొద్దని చెప్పింది కదా అంటుంది. కృష్ణ ఆవేశంగా శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ముకుంద ఫోటో కింద పడేస్తుంది. నా కూతురు ఫోటో ఎందుకు పగలగొట్టావని నిలదీస్తాడు. మీ కూతురు చనిపోయిందా? అది నిజమని నీ కూతురు మీద ఒట్టు వేసి చెప్పమని కృష్ణ నిలదీస్తుంది.
బతికే ఉంది కదా బాబాయ్ అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావ్. నీ కూతురితో కలిసి నాటకం ఆడుతున్నావ్, తనతో కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నావా అని బాధగా అడుగుతుంది. నేను నా కూతురిని చూసినట్టే నిన్ను చూశాను అంత మాట అనొద్దని అంటాడు.
నేను ఇప్పటి వరకు అదే అనుకున్నా. కానీ నువ్వు చూపించిన ప్రేమ కపటమని తెలిసిపోయింది. మీరు బాధ్యతగల తండ్రి అయితే తనని నాలుగు తనని ఇంట్లో కూర్చోబెడతావు. కానీ తనని ఉసిగొల్పి నా మీదకు పంపిస్తావా? అని నిలదీస్తుంది. ఏం మాట్లాడుతున్నావని శ్రీనివాస్ అంటాడు.
నువ్వు మంచి తండ్రివి కాదు
అది తన మాట వినలేదని చెప్తాడు. నీ కూతురు మా జీవితాలను తల్లకిందులు చేస్తుంది. నా బిడ్డని తన కడుపున మోస్తూ పరాయి మగాడితో బిడ్డని కన్నాను అని సిగ్గులేకుండా చెప్పేంతగా బరితెగించింది. అంటే నీ పెంపకంలో లోపం ఉన్నట్టే కదా. నువ్వు మంచి తండ్రివి కాదు. పరిస్థితులకు భయపడి తప్పించుకునే స్వార్థపరుడివి.
నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుందని తిడుతుంది. నువ్వు అలా తిట్టడంలో తప్పు లేదు. నాకు కూతురు పుట్టినప్పుడు ఎంతో మురిసిపోయాను. ఇప్పుడు తను రూపం మార్చుకుని నా మాట లెక్కచేయడం లేదని చెప్తాడు. నీ కూతురు నీ మాట వినడం లేదని వదిలేస్తావా?
తన వల్ల నష్టపోతున్న జీవితాలు ఎన్ని ఉంటున్నాయి. అలా జరగకుండా ఆపాలి కదా. ముకుంద నా మాట వినబడటం లేదు రూపం మార్చుకుని వస్తుందని ఒక్క మాట నాకు చెప్తే ఇన్ని అనార్థాలు జరిగేవి కాదు కదా. నా గర్భసంచి పోయేలా చేసింది.
కూతురిని వెనకేసుకొచ్చిన శ్రీనివాస్
పథకం ప్రకారం నా బిడ్డ తన కడుపులో పడేలా చేసుకుంది. ఇప్పుడు అదే బిడ్డ తనకు దక్కాలని లేనిపోనీ నిందలు వేస్తుంది. నా వాళ్ళు నన్ను అవమానించేలా చేస్తుంది. ఏసీపీ సర్ ఏమైపోయారో తెలియదు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి జరిగింది మొత్తం పెద్దత్తయ్యకు చెప్పు అని అడుగుతుంది.
నా కూతురు తప్పు చేసిందంటే నమ్ముతాను. కానీ న్యాయం గురించి మాట్లాడితే ఏం చేయలేను అంటాడు. మురారిని ముందుగా ప్రేమించింది నువ్వా, నా కూతురా? అంటాడు. ప్రేమ కంటే పెళ్లి ముఖ్యమని కృష్ణ చెప్తుంది. పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు మీరు.
సంవత్సరం అగ్రిమెంట్ అన్నారు ఆ ఇంట్లో నువ్వు ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయినా ఇల్లు వదిలి వెళ్లిపోయావు. కానీ నా కూతురు ఇంటిల్లిపాది ఛీ కొట్టినా అసహ్యించుకున్నా ఇల్లు వదిలి వెళ్లలేదు. రూపం మార్చుకుంది మురారి ద్వారా బిడ్డను కనాలని సరోగసికి సిద్ధమైంది.
నేనేం చేయలేను ఏం చేస్తావో చేసుకో
ఇన్ని చేసినా నా కూతురు ప్రేమని అర్థం చేసుకుని మౌనంగా ఉన్నానే తప్ప వేరే కారణం కాదు. నేను ఏం చెప్పలేను ఇప్పుడు నేను ఎదురు చెప్పలేను. ఇప్పుడు నా కూతురు ఏంటో తెలిసింది కదా ఏం చేస్తావో చేసుకో నేను మాత్రం ఏం చేయలేనని చేతులెత్తేస్తాడు.
మురారి ముకుంద మాటలు తలుచుకుని బాధపడతాడు. నిజం కృష్ణకి మాత్రమే తెలుసు నిజం నమ్మించడానికి కృష్ణ ఎన్ని పాటలు పడుతుందో. నేను ఎక్కడ ఉన్నానో తెలియక ఎంత బాధపడుతుందో అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మురారి వచ్చి కన్నీళ్ళు తుడుస్తుంది.
కృష్ణ గుర్తుకు వచ్చిందా అని అడుగుతుంది. మర్చిపోతే కదా అంటాడు. నువ్వు కృష్ణని మర్చిపోవాలని ఇంత చేస్తుంటే ఇలా చేస్తావ్ ఏంటని అంటుంది. కృష్ణని మర్చిపోలేను నిన్ను కోరుకోలేను. అయినా ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావో అర్థం కావడం లేదు.
నువ్వు ఇక్కడ నుంచి పారిపోలేవు
యాక్సిడెంట్ వల్ల కలిగిన దెబ్బ కంటే నీ ప్రవర్తన వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది. ఇక నా వల్ల కాదు కృష్ణని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఒక్కసారి చూపించు అని అడుగుతాడు. చూపిస్తాను కానీ అదే ఆఖరి చూపు అనుకుని మర్చిపోతావా అని అడుగుతుంది.
టైమ్ ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు ఈరోజు కాకపోతే రేపైన నన్ను వదిలేయాల్సిందేనని మురారి అంటే వదల్లేక కదా ఇన్ని పాట్లు పడుతుంది. ఒకవేళ కృష్ణ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకుని ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్తుందని అనుకుంటున్నావ్ ఏమో.
నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసే ఛాన్స్ లేదు ఎందుకంటే నేను అంతగా ప్లాన్ చేశాను. నువ్వు కోలుకున్నాక నన్ను తోసేసి వెళ్లిపోదామని అనుకుంటున్నావేమో. నీ మనసు మారే వరకు బెడ్ మీద ఇలాగే ఉంటావ్. ఎందుకంటే నేను ఆ రకంగా ప్లాన్ చేశాను.
కృష్ణని వదిలేసి నా దగ్గరకు రావాలి
నువ్వు నాతో ఉండటం ముఖ్యం. అది ఎలాగైనా సరే అంటుంది. ఇది ప్రేమ కాదు పైశాచికత్వం అంటాడు. తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావ్. అక్కడ నీకోసం టెన్సిన్ పడుతున్నారని అనుకుంటున్నావ్ ఏమో. నన్ను కడుపు చేసి పారిపోయావ్ అనుకుంటున్నారని అంటుంది.
ఎవరు నమ్మిన కృష్ణ నమ్మదని చెప్తాడు. కృష్ణని నమ్మించడం నాకు క్షణంలో పని. కృష్ణ వదిలేస్తే నువ్వు నాకు దక్కడం కాదు. నువ్వు కృష్ణని వదిలేసి నా దగ్గరకు రావాలని చెప్తుంది. కలలో కూడా అది జరగదని చెప్తాడు. జరిగి తీరుతుంది నీకు చాలా టైమ్ ఇస్తాను నువ్వు రాజీ పడతావో లేదంటే నాతో ప్రేమలో పడతావో తెలియదు.
నువ్వు నీ వాళ్ళందరినీ మర్చిపోవాలి. నువ్వు నేను మన బిడ్డ ఇదే మన ప్రపంచం కావాలి. అది నీ బిడ్డ కాదు మా బిడ్డ. సరే మీ బిడ్డ కానీ న బిడ్డలా చూసుకుంటాను. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
నీ వల్ల నేను తల్లిని అయ్యాను అని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు కృష్ణ కూడా నమ్మేసిందని చెప్తుంది. కృష్ణ ముకుందను ఫాలో అవుతూ వస్తుంది. గదిలో మురారి కదల్లేని స్థితిలో ఉండటం కృష్ణ, మధు చూస్తారు. ముకుంద షాక్ అవుతుంది.