Best Web Hosting Provider In India 2024
Jr NTR : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. ఈ పార్టీల అధినేతలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా జూ.ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ, భరత్, పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు.
“ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
టాపిక్