Best Web Hosting Provider In India 2024
Semiya Dosa: దక్షిణ భారతదేశంలో అధిక శాతం మంది తినే అల్పాహారం దోశలు. అనేక రకాలుగా ఈ దోశలను తయారు చేయవచ్చు. సాధారణంగా దోశెల పిండిని తయారు చేయాలంటే ముందు రోజే పప్పులను, బియ్యాన్ని నానబెట్టి రుబ్బుకొని పులియబెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అంత సమయం దొరకదు. అలాంటప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో దోశలను రెడీ చేసుకోవచ్చు. అలాంటి దోశెల్లో సేమ్యా దోశ ఒకటి. రుచి అదిరిపోతుంది. క్రిస్పీగా వస్తుంది. పిల్లలకు ఈ దోశ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ దోశను తయారు చేయవచ్చు.
సేమియా దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
సేమ్యా – ఒక కప్పు
ఉప్మా రవ్వ – ఒక కప్పు
పెరుగు – కప్పున్నర
నీళ్లు – తగినన్ని
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – సరిపడినంత
సేమియా దోశ రెసిపీ
1. ప్రతి ఇంట్లోనూ సేమ్యా, ఉప్మా రవ్వ, పెరుగు వంటివి కచ్చితంగా ఉంటాయి.
2. ముందుగా మిక్సీజార్లో సేమ్యాను వేసి పొడి చేసుకోవాలి.
3. అందులోనే ఉప్మా రవ్వను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
4. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఆ గిన్నెలోనే పెరుగు, సరిపడినంత నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
6. దోశ పిండికి ఎంత జారుడుతనం అవసరమో.
7. అంతవరకు నీళ్లు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావుగంట పాటు వదిలేయాలి
8. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
9. ఆ నూనె వేడెక్కాక సేమ్యా మిశ్రమంతో దోశను పలుచగా వేసుకోవాలి.
10. పైన ఉల్లి ముక్కలు జల్లుకుంటే టేస్టీగా ఉంటుంది.
11. రెండు వైపులా కాల్చుకున్నాక తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి.
12. ఈ సేమియా దోశలను కొబ్బరి పచ్చడితో తిన్నా, పల్లి పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. టమోటో పచ్చడి కూడా దీనికి మంచి కాంబినేషన్. ఒక్కసారి తిన్నారంటే అదిరిపోతుంది.
స్కూళ్లు మరికొన్ని రోజుల్లో ప్రారంభమైపోతున్నాయి. అప్పటికప్పుడు చేయాల్సిన అల్పాహారంలో అవసరం పడతాయి. అలాంటి వాటిల్లో ఈ సేమియా దోశ కూడా ఒకటి. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది నచ్చడం ఖాయం. ఎందుకంటే ఇది క్రిస్పీగా వస్తుంది.
టాపిక్