Satyabhama Twitter Review: సత్యభామ ట్విటర్ రివ్యూ.. కాజల్ అగర్వాల్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

Kajal Agarwal Satyabhama Twitter Review: లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తర్వాత టాలీవుడ్ చందమామగా చాలా పేరు తెచ్చుకుంది. ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి అగ్ర కథానాయికగా వెలుగు వెలిగింది. పెళ్లి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా మొదలుపెట్టింది.

కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించిన సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మేజర్ మూవీ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క సమర్పకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీతో సుమన్ చిక్కాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించి నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇప్పటికే సత్యభామ సినిమా పోస్టర్స్, కాజల్ అగర్వాల్ లుక్, టీజర్, ట్రైలర్ మూవీపై మంచి అంచనాలు పెంచేలా చేసింది. ఇందులో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, సత్యభామ మూవీ ఇవాళ (జూన్ 7) థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ క్రైమ్ థ్రిల్లర్‌ మూవీపై నెటిజన్స్, ఆడియెన్స్ ఏం చెప్పారో సత్యభామ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

“ప్రసాద్ ఐమాక్స్‌లో కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా చూశాం. ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా ఉన్న టెర్రిఫిక్ కాప్ థ్రిల్లర్ మూవీ. శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అదిరిపోయింది. శ్రీ చరణ్ పాకాలా అందించిన బీజీఎమ్, స్టన్నింగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అమ్మాయిలు కచ్చితంగా చూడాల్సిన సినిమా సత్యభామ” అని ఒకరు రివ్యూ ఇచ్చారు.

“సత్యభామ సినిమా చూశా. ఇది పూర్తిగా కాజల్ అగర్వాల్ షో. ఎన్నో ట్విస్టులు, టర్న్స్ ఉన్నాయి. సినిమాకు కాజల్ అగర్వాల్ సోల్. క్వీన్ ఆఫ్ మాసెస్ నటన అదిరిపోయింది. ఆమె పవర్‌ఫుల్ పర్ఫామెన్స్ సూపర్బ్‌గా ఉంది. హ్యాట్సాఫ్” అని ఒక యూజర్ రాసుకొచ్చారు.

“కాజల్ అగర్వాల్ ఫర్మామెన్స్, యాక్టింగ్ అవుట్ స్టాండింగ్‌గా ఉంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ సత్యభామ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది” అని రివ్యూ ఇస్తూ సత్యభామ మూవీకి 5కి 4 రేటింగ్ ఇచ్చారు ఓ యూజర్.

“బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ సత్యభామ. ఫస్టాఫ్ సాలిడ్‌గా ఉంది. అలాగే సెకండాఫ్ డీసెంట్‌గా ఉండి ఇంప్రెస్ చేస్తుంది. సెకండాఫ్‌లో కాజల్ అగర్వాల్ చేసిన ఫైట్ సీన్స్ అదిరిపోయాయి. మల్టీపుల్ లేయర్స్‌తో ఎన్నో రకాలుగా అనుభూతి చెందేలా చేస్తుంది సత్యభామ సినిమా. ట్విస్టులు క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేస్తూంటాయి. థియేటర్లలో చూడటం అస్సలు మిస్ కావొద్దు” అని మరొక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024