IBPS RRB Recruitment: గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్‌ ఉద్యోగాలు, ఐబీపీఎస్‌ నోటిఫికేషన్ విడుదల

Best Web Hosting Provider In India 2024

saIBPS RRB Recruitment: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీపీఎస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రీజినల్ రూరల్ బ్యాంక్స్‌ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్‌ ఏ ఆఫీసర్లైన స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అధికారుల నియామకంతో పాటు గ్రూప్‌ బిలో మల్టీ పర్సస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ఐబీపీఎస్‌ రూరల్‌ బ్యాంక్‌ ఉద్యోగాల నియామక షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. పూర్తి నోటిఫికేషన్ ఐబిపిఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియమనిబంధనలు పూర్తిగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోస్టులకు దరఖాస్తు చేస్తే స్థానిక భాష విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. రాత పరీక్షల్లో అర్హత సాధించినా నియామకాలకు అయా బ్యాంకులు తిరస్కరించే అవకాశాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుల నమోదు, ఎడిట్‌ ప్రక్రియను జూన్ 7 నుంచి 27 తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • అర్హులైన అభ్యర్థులకు ఐబీపీఎస్‌ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ను జులై 22 నుంచి 27వరకు అందిస్తారు. ఈ శిక్షణను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు.
  • జులై నెలాఖరులో హాల్‌ టిక్కెట్లను విడుదల చేస్తారు.
  • ఆగష్టులో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు.
  • ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రాథమిక పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహిస్తారు.
  • 2024 అక్టోబర్‌లో మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేస్తారు. అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌లో స్కేల్ 1, స్కేల్2, స్కేల్ 3 ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థుల జాబితాను 2025 జనవరిలో విడుదల చేస్తారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాంకులు ఇవే..

తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రామీణ బ్యాంకులు కూడా ఐబీపీఎస్ తాజా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్ (285 పోస్టులు), కడప కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (100పోస్టులు), గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు (50పోస్టులు), చిత్తూరు కేంద్రంగా ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు, హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు (135పోస్టులు) తాజా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తిగా బ్యాంకుల యాజమాన్యాల పరిధిలోనే ఉంటాయని ఐబీపీఎస్ స్పష్టం చేసింది. అభ్యర్థిత్వాన్ని తిరస్కరించే హక్కు వాటికి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

దరఖాస్తు ఫీజు

స్కేల్‌ 1, స్కేల్ 2, స్కేల్‌ 3 ఆఫీసర్ ఉద్యోగాలకు, మల్టీ పర్పస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అభ్యర‌్థులు రూ.850 ఫీజు చెల్లించాలి.

ఐబీపీఎస్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి. https://ibpsonline.ibps.in/rrbxiiimay24/

ఐబీపీఎస్‌ మల్టీ పర్పస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి. https://ibpsonline.ibps.in/rrb13oamay24/

ఐబీపీఎస్‌ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ చూడటానికి ఈ లింకును క్లిక్ చేయండి. https://ibps.in/wp-content/uploads/CRP_RRBs_XIII_notification_6.6.24.pdf

ఐబీపీఎస్‌ పూర్తి నోటిఫికేషన్‌ దిగువ డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

Open PDF in New Window

IPL_Entry_Point

టాపిక్

BankingJobsBank JobsNotificationTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024