Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Serial: రిషి కనిపించడం లేదని పేపర్‌లో ప్రకటన ఇస్తుంది వసుధార. ఆ ప్రకటన చూసి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి రిషిని తాను చూశానని చెబుతాడు. అతడు చెప్పిన లొకేషన్‌కు వసుధార, మను వెళ్లగా అక్కడ శైలేంద్ర కనిపిస్తాడు. రిషి పేరుతో శైలేంద్ర ఫేక్ కాల్ చేశాడని అతడిపై వసుధార ఫైర్ అవుతుంది.
తాను కాల్ చేయలేదని శైలేంద్ర బుకాయిస్తాడు. ఎవరు ఫోన్ చేశారో తనకు తెలియదని అబద్ధం ఆడుతాడు. తన ఫోన్ లో డయల్ నంబర్స్ చూపిస్తాడు. ఆ కాల్ శైలేంద్ర చేశాడో లేదో తెలుసుకోవడానికి అదే నంబర్‌కు వసుధార కాల్ చేస్తుంది. కానీ అవతలి వ్యక్తి ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయడు.
వసుధార వార్నింగ్…
నా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తుంది వసుధార. రిషి విషయంలో ఇలాంటి డ్రామాలు ఆడితే ఏం చేస్తానో నాకే తెలియదని హెచ్చరిస్తుంది. వసుధార వార్నింగ్ సహించలేని శైలేంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. టీస్టాల్ ఓనర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని శైలేంద్రనే ఆ కాల్ చేశాడని వసుధార, మను కనిపెడతారు.
దేవయాని అనుమానం…
మహేంద్రను వెతుక్కుంటూ అతడి ఇంటికి వస్తుంది దేవయాని. ఇంట్లో మహేంద్ర, అనుపమలను చూసి మీరు ఇద్దరే ఉన్నారా అంటూ అనుమానిస్తూ మాట్లాడుతుంది. ఆమె మాటలతో మహేంద్ర నొచ్చుకుంటాడు. రిషి గురించి వసుధార పేపర్‌లో ఇచ్చిన యాడ్ చూపించి ఇంటి పరువుతో పాటు కాలేజీ పరువు కూడా ఈ యాడ్‌తో బజారులో పడేశారని దేవయాని ఎగతాళి చేస్తుంది.
వసుధార వల్లే మన మధ్య మనస్పర్థలు వచ్చాయని, వసుధార ఇంట్లో కాలుపెట్టకముందు అందరం కలిసి సంతోషంగా ఉన్నామని, రిషి కనిపించకుండా పోవడానికి వసుధారనే కారణమని దేవయాని అంటుంది. వసుధార పట్ల తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడుతుంది. మహేంద్రను తన బుట్టలో పడేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె డ్రామాలను మహేంద్ర నమ్మడు.
దేవయానిపై చెయ్యెత్తిన మహేంద్ర…
దాంతో రూట్ మార్చిన దేవయాని మరోసారి మహేంద్ర, అనుపమ బంధం గురించి తప్పుగా మాట్లాడుతుంది. మేమేం తప్పు చేయడం లేదని మహేంద్ర అంటాడు. ఎవరికి తెలుసు…మేమేం చూస్తున్నామా అని దేవయాని బదులిస్తుంది. దాంతో మహేంద్ర ఆవేశం పట్టలేక దేవయానిపై చేయెత్తుతాడు.
కానీ అనుపమ ఆపడటంతో కొట్టకుండా మధ్యలోనే చేయి ఆపేస్తాడు. కొడతావా అంటూ దేవయాని అంటుంది. వదిన అంటే తల్లితో సమానం. నేను మిమ్మల్ని తల్లిగానే భావించాను. కానీ మీరు నన్ను శత్రువుగానే భావించారు. బంధం, బంధుత్వం గురించి మీకు తెలిస్తే నేను ఈ క్షోభ అనుభవించేవాడిని కాదని దేవయానితో అంటాడు మహేంద్ర.
రిషి కర్మకాండలు జరిపిస్తా….
రిషిని తిరిగి తీసుకొస్తానని మీరు పెట్టిన గడువుకు కొన్ని రోజులే సమయం ఉందని మహేంద్రతో అంటుంది దేవయాని. గడువు పూర్తయ్యేలోపు రిషిని తీసుకురాకపోతే అతడికి కర్మకాండలు జరిపిస్తానని వార్నింగ్ ఇస్తుంది. డీబీఎస్‌టీ కాలేజీలోనే పెద్ద ఫంక్షన్ ఏర్పాటుచేసి కర్మకాండలు జరిపించి రిషికి సంతాపం తెలుపుతానని వార్నింగ్ ఇస్తుంది దేవయాని.
స్టూడెంట్స్ షాక్…
రిషి గురించి పేపర్‌లో యాడ్ చూసి స్టూడెంట్స్ షాకవుతారు. రిషి ఎక్కడున్నాడో మీకు కూడా తెలియదా అని వసుధారను అడుగుతారు. రిషి బతికి ఉన్నాడా లేదా అని నిలదీస్తారు. రిషి బతికే ఉన్నాడని వసుధార అంటుంది. రిషి ఎక్కడున్నాడో తెలియనప్పుడు మీరు అతడు బతికే ఉన్నాడని ఎలా చెబుతారని స్టూడెంట్స్ అడగటంతో వసుధార మౌనంగా ఉండిపోతుంది.
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర గొడవను పెద్దది చేస్తాడు. క్లారిటీ ఇవ్వాల్సిన మీరే స్టూడెంట్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని వసుధార, మనులతో అంటాడు శైలేంద్ర. రిషిని స్టూడెంట్స్ ఎంతో మిస్సవుతున్నారని, వారి బాధను, ఎమోషన్‌ను అర్థం చేసుకుంటే బాగుంటుందని డ్రామా ఆడుతాడు శైలేంద్ర. రిషి గురించి ఆలోచిస్తూ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైమ్‌లో డిస్ట్రబ్ అవుతున్నారని చెబుతాడు. రిషి బతికే ఉంటే స్టూడెంట్స్ కోసమైనా అతడికి తీసుకురమ్మని వసుధారతో ఛాలెంజ్ చేస్తాడు శైలేంద్ర.
రిషిని తీసుకొస్తా…
రిషిని తీసుకొచ్చే టైమ్ దగ్గరలోనే ఉందని, రిషిని తీసుకురాకపోతే ఏం చేయాలో నాకు తెలుసునని స్టూడెంట్స్‌తో అంటుంది వసుధార. రిషి గురించి ఆలోచించకుండా చదువుపై ఫోకస్ పెట్టమని చెబుతుంది. ఆమె మాటలతో స్టూడెంట్స్ కన్వీన్స్ అవుతారు. వసుధార ధైర్యం చూసి శైలేంద్ర కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతాడు. వసుధార ధైర్యానికి, నమ్మకానికి హ్యాట్సాఫ్ చెబుతాడు.
దేవయాని ట్రాప్…
రిషికి దేవయాని కర్మకాండలు జరిపించకముందే అతడి ఆచూకీ కనిపెట్టాలని వసుధార, మహేంద్ర అనుకుంటారు. కర్మకాండల పేరుతో దేవయాని, శైలేంద్ర మనల్ని ట్రాప్‌లో పడేయాలని చూస్తున్నారని, వారి మాయలో పడకుండా రిషిని వెతకడంపైనే ఫోకస్ పెట్టమని అంటుంది.
శైలేంద్ర జాతకం రివర్స్
శైలేంద్ర తన జాతకం చూసి మురిసిపోతుంటాడు. కొన్నాళ్లుగా తాను చేసిన పనులన్నీ సక్సెస్ అవుతున్నాయని, ఏం చేసినా కలిసొస్తుందని సంబరపడతాడు. అతడికి ఫణీంద్ర క్లాస్ పీకుతాడు. నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటో నాకు తెలిసిపోయిందని అంటాడు. కొడుకును చెడామడా వాయిస్తాడు. తండ్రి మాటలతో కిక్కురుమనకుండా ఉండిపోతాడు శైలేంద్ర. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.