Best Web Hosting Provider In India 2024
Love Mouli Review: చాలా కాలం తర్వాత హీరోగా లవ్ మౌళి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు నవదీప్(Navdeep). యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహించాడు. ఫంఖూరి గిద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ చేశాడు. నవదీప్ 2.0 అంటూ వినూత్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అతడికి హిట్టు తెచ్చిపెట్టిందా? లేదా? అంటే?
మౌళి ప్రేమకథ…
తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) ఒంటరిగా అనాథలా పెరుగుతాడు. సమాజానికి దూరంగా మేఘాలయలోని తన రిసార్ట్‌లో ప్రకృతి మధ్య తనకు నచ్చినట్లుగా బతుకుతుంటాడు. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. చిన్నతనం నుంచి ఎదురైన అనుభవాల కారణంగా మౌళికి ప్రేమపై అంతగా నమ్మకం ఉండదు. తన జీవితంలోకి రాబోయే అమ్మాయి విషయంలో స్పష్టమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉండవు.
ఓ అఘోరా (రానా దగ్గుబాటి) ఇచ్చిన పెయింటింగ్ బ్రష్ ద్వారా తాను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. మౌళి వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు వారి ప్రేమ బంధం సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత చిత్రతో గొడవలు రావడంతో మరో పెయింటింగ్ గీస్తాడు మౌళి. మళ్లీ మౌళి ముందు చిత్రనే ఎందుకు ప్రత్యక్షమైంది? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? మౌళి లవ్ బ్రేకప్‌కు కారణం ఏమిటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని మౌళి ఎలా తెలుసుకున్నాడు? అన్నదే లవ్ మౌళి మూవీ కథ.
బోల్డ్ లవ్‌స్టోరీ…
ప్రేమ కథలను తెరకెక్కించడంలో ఒక్కో దర్శకుడి శైలి ఒక్కోలా ఉంటుంది. కొందరు దర్శకులు ప్రేమకథలను పొయెటిక్‌గా గ్లామర్ హంగులకు తావు లేకుండా క్లీన్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరిస్తుంటారు. మరికొందరు మాత్రం బోల్డ్‌గా యూత్ ఆడియెన్స్ అట్రాక్ట్ చేసేలా ప్రేమకథలను తెరకెక్కిస్తోంటారు.
లవ్ మౌళి రెండో కోవకు చెందిన సినిమా. తాను కోరుకునే అమ్మాయిని తానే స్వయంగా సృష్టించుకునే శక్తి ఓ యువకుడి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌కు ఫాంటసీ అంశాలను మిళితం చేస్తూ దర్శకుడు డిఫరెంట్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు.
యువతరం ఆలోచనలు…
ప్రేమ, పెళ్లి విషయంలో యువతరం ఆలోచనలు, వాళ్లలోని కన్ఫ్యూజన్స్‌తో ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు అవనీంద్ర. సాధారణే కథనే అయినా నవదీప్ క్యారెక్టరైజైషన్‌ను కొత్తగా రాసుకుంటూ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా లవ్ మౌళి సినిమాను చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు డైరెక్టర్. లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌తో మౌళి లవ్ స్టోరీ రొమాంటిక్‌గా సాగుతుంది. ఓ ప్రమోషనల్ స్ట్రాటజీగా కాకుండా కథలో అంతర్భాగంగానే వచ్చేలా ఆ సీన్స్ రాసుకున్న తీరు మెప్పిస్తుంది.
భిన్న మనస్తత్వాలు….
ఫస్ట్ హాఫ్ కాస్త సాగతీతగా అనిపించిన సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఒంటరితనాన్ని కోరుకునే మౌళి జీవితంలోకి చిత్ర వచ్చింది? భిన్న మనస్తత్వాలు కలిగిన వారి మధ్య సంఘర్షణను అర్థవంతంగా చూపించాడు. అలాంటి డ్రామా ఫస్ట్ హాఫ్‌లో మిస్సయింది. నవదీప్ పాత్ర పరిచయానికి దర్శకుడు ఎక్కువగా టైమ్ తీసుకున్నాడు.
క్లైమాక్స్ రొటీన్…
సెటప్, క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఉన్నా…మెయిన్ పాయింట్ రొటీన్‌గా సాగడమే సినిమాకు మైనస్‌గా మారింది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఎండ్ చేయడం డిసపాయింట్‌కు గురిచేస్తుంది. కొన్ని బోల్డ్ సీన్స్ కథకు అవసరం లేని ఫీలింగ్ కలుగుతుంది.
నవదీప్‌లోని కొత్త కోణం…
నటుడిగా నవదీప్‌ను కొత్త కోణంలో చూపించిన మూవీ ఇది. అతడి లుక్‌లోనే కాకుండా నటనలో వైవిధ్యం కనబడింది. సమాజపు కట్టుబాట్లతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా బతికే యువకుడి పాత్రలో చక్కటి యాక్టింగ్‌ను కనబరిచాడు. చిత్ర పాత్రలో ఫంకూరి గిద్వానీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. గ్లామర్‌ను పండిస్తూనే క్యారెక్టర్ పరంగా ఆమె చూపించిన వేరియేషన్స్ మెప్పిస్తాయి. అఘోరాగా గెస్ట్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించి సర్‌ప్రైజ్ చేశారు.
యూత్‌ఫుల్ లవర్‌స్టోరీ
లవ్ మౌళి యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన లవ్‌స్టోరీ. నవదీప్ యాక్టింగ్‌తో పాటు లొకేషన్స్, విజువల్స్ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతాయి. .
రేటింగ్:2.75/5