Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: ‘వచ్చే ఎన్నికల్లో మీ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేషా, చంద్రబాబు నాయుడా..? పవన్ కల్యాణా..? ముందు ఆ అంశాన్ని తేల్చుకోండి. సీఎం అభ్యర్థి ఎవరనేది ముందు క్లారిటీకి రండి.. విడివిడిగా వచ్చినా, అంతా కలిసి పొత్తుపెట్టుకొని మాపై పోటీకి వచ్చినా వైయస్‌ఆర్ సీపీ సిద్ధమే’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడో, ఏ మేరకు సమాచారం ఉందో అర్థం కావడం లేదన్నారు. కుట్రలో భాగంగానే తనపై విషప్రచారం చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ రోల్ ఏంటో అందరికీ తెలుసని, చంద్రబాబు రిమోట్ నొక్కితే పవన్ కల్యాణ్ ఏపీకి వచ్చి మాట్లాడుతాడన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.