OTT: ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హారర్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులకు జడుసుకోవాల్సిందే.. ఎక్కడ చూస్తారంటే?

Best Web Hosting Provider In India 2024

Miral Movie OTT Release: హారర్ అండ్ క్రైమ్ జోనర్ సినిమాలకు ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కరెక్ట్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే ట్విస్టులతో తెరకెక్కిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. ఇక ఈ జోనర్ మూవీస్‌కు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి తరహాలో సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఎలా ఉంటుదన్న క్యూరియాసిటీతో మూవీని అటెంప్ట్ చేస్తారు.

అందుకే హారర్ అండ్ క్రైమ్ సస్పెన్స్ చిత్రాలకు ఎప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటిది హారర్ అండ్ క్రైమ్ రెండు మిక్స్ అయి సినిమా వస్తే. అంతేకాకుండా ట్విస్టులతో జడుసుకునేలా.. ప్రేక్షకులను వణికించే సినిమా అయితే. అవును అలాంటి సినిమానే మిరల్. రెండేళ్ల క్రితం అంటే 2022 నవంబర్ 11న థియేటర్లలో తమిళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో ఈ మూవీపై ఎక్కడ లేని క్యూరియాసిటీ, బచ్ ఏర్పడింది.

ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ నటించిన మరో ఇంట్రెస్టింగ్‌ మూవీనే మిరల్. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన మిరల్ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. హారర్, సస్పెన్స్, క్రైమ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు. ఇటీవల తెలుగు థియేట్రికల్ కోసం విడుదల చేసిన ట్రైలర్ ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీ మీద అంచనాలు పెరిగాయి.

శ్రీమతి. జగన్మోహిని అండ్ జీ ఢిల్లీ బాబు సమర్ఫణలో తెలుగులో మిరల్ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేశారు. కానీ, అంతగా రెస్పాన్స్ దక్కించుకోలేదు. అందుకే ఇప్పుడు 20 రోజుల్లోనే ఓటీటీలోకి దించేశారు మేకర్స్. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన మిరల్ మూవీ మరింత భయపెట్టనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మిరల్ సినిమా ఇవాళ్టి నుంచి అంటే జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాషలో మిరల్ మూవి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఆహాలో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

ఇదిలా ఉంటే, మిరల్ సినిమా తెలుగు థియేట్రికల్ విడుదల తేదిని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అయింది. ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు.

కాగా మిరల్ చిత్రానికి ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించారు. సురేష్ బాలా సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటర్‌గా కలైవానన్ ఆర్ వ్యవహరించారు. భరత్, వాణి భోజన్‌తోపాటు డైరెక్టర్, నటుడు కేఎస్ రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024