Best Web Hosting Provider In India 2024
TG Rains and Deaths: నైరుతి ఋతు పవనాల ప్రభావంతో, తెలంగాణ మొత్తం మీద ఉరుములు పిడుగులతో కూడిన వానలు పడటంతో, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుతో నలుగురు మరణించారు. మెదక్ జిల్లా హవేళిఘన్పూర్ మండలంలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన శేట్టిబోయిన సిద్దయ్య (51), వొడంగుల నందు (22) దగ్గరలోని అడవిలోకి బుధవారం సాయంత్రం పొయ్యిల కట్టెలు తేవడానికి వెళ్లారు. వారి ఇద్దరి మీద పిడుగు పడటంతో, ఇద్దరూ కూడా అక్కడిక్కడే మరణించారు. గ్రామస్థులు ఎంత వెతికిన బుధవారం రాత్రి వరకు వారు దొరక లేదు.
మరుసటిరోజు దొరికిన శవాలు….
గురువారం ఉదయం గ్రామస్తులంతా కలిసి వెతకగా, సిద్దయ్య, నందు ఇద్దరు కూడా విగతజీవులుగా అడవిలో ఉన్నచిన్న గుట్ట పైన దొరికారు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మరణించడంతో, ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. మరో రెండు సంఘటనలో, ఇంకా ఇద్దరు వ్యక్తులు మెదక్ జిల్లాలో పిడుగుపాటు వలన మరణించారు.
మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలంలోని పీర్లతండాకి చెందిన దలావత్ గెమ్యా నాయక్ (55), తన గ్రామా శివారున పొలంలో పనిచేస్తుండగా ఉడుములు పిడుగులతో బారి వర్షం రావటంతో, తడవకుండా ఉండటానికి చెట్టు కిందికి పరిగెత్తాడు. చెట్టు మీద పిడుగు పడటంతో, గెమ్యా నాయక్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు.
సంగారెడ్డి చెందిన కూలీపై పిడుగు…
సంగారెడ్డి జిల్లాలో జరిగిన మరొక సంఘటనలో, మరొక రైతు కూలి మృతి చెందిన సంఘటన కోహిర్ మండలంలో జరిగింది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిల్లిపురం గోపాల్ (40), కోహిర్ గ్రామంలో కూలికి వచ్చాడు. తాను పొలంలో పనిచేస్తుండగా, ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం రావటంతో, తాను చెట్టు కిందికి పరిగెత్తుతుండగా పిడుగుపడి అక్కడిక్కక్కడే మరణించాడు. పొట్టకూటి కోసం కూలికి వచ్చిన వ్యక్తి, పిడుగుపడి మరణించడంతో ఆ కుటుంబన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
రాష్ట్రము మొత్తం మీద తొమ్మిది మంది మృతి….
రాష్ట్రం మొత్తం మీద, గురువారం ఒక్క రోజు పిడుగులు పడి 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లలో నలుగురు చనిపోగా, నాగర్ కర్నూల్ జిల్లాలో మరొకరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి చెందిన భార్యాభర్తలు, అనక సంతోష్ (26), భార్య స్వప్న (22) తమ గ్రామమమైన డొంకర్ గాం శివారులో వారి పొలములో పనిచేస్తుండగా వారిపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందారు.
నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన మూడరపు ప్రవీణ్ (26) పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇదే జిల్లా తానూరు మండలం ఎల్వత్ కి చెందిన మాగీర్వాడ్ శ్రీ (13) అనే అబ్బాయి కూడా మృతి చెందాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలో వెల్డండ గ్రామంలోని దిల్వార్పూర్ కు చెందిన జంగమ్మ (40) తన భర్త కృష్ణయ్య, తల్లి జంగిలి ఈదమ్మతో కలిసి వారి పొలంలో పత్తి విత్తనాలు పెడుతుండంగా, వారి పై పిడుగుపడి జంగమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. కృష్ణయ్య, ఈదమ్మ కూడా తీవ్ర గాయాలతో, అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి, అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)
టాపిక్