Best Web Hosting Provider In India 2024
Taapsee Pannu About Falling Love With Husband: ఒకప్పటి టాలీవడ్ హీరోయిన్, ప్రస్తుత బాలీవుడ్ బ్యూటి తాప్సీ పన్ను తన లవర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చిలో ఉదయ్‌పూర్‌లో తాప్సీ, మథియాస్ బో పెళ్లి జరిగింది. అయితే, తాజాగా తన భర్త మథియస్ బోతో నడిపించిన లవ్ ట్రాక్, రిలేషన్‌షిప్‌పై ఊహించని నిజం చెప్పింది తాప్సీ.
తాజాగా కాస్మోపాలిటన్ ఇండియాకు ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో మథియాస్‌తో ఉన్న లవ్ రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయింది తాప్సీ పన్ను. మథియస్ బోతో తాను మొదటి చూపు ప్రేమలో అదేనండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాలేదని చెప్పుకొచ్చింది తాప్సీ. మథియస్‌తో రిలేషన్ గురించి చాలా కాలం ఆలోచించినట్లు, వాళ్ల మధ్య సంబంధం ఎంత దూరం వెళ్తుందో చూడాలనుకుందట ఈ కర్లీ హెయిర్ బ్యూటీ తాప్సీ.
“అథ్లెట్ల పట్ల నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వంటిది కాదు. ఇది నిజంగా రియాలిటీలో ప్రాక్టికల్‌గా వర్క్ అవుతుందా అని చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యమైనది. అది ఎంతకాలం ఉంటుందో సాధ్యాసాధ్యాలు చూడాల్సిన అవసరం ఉంది. నేను అతనిని అభిమానించాను, గౌరవించాను. అంతేకాకుండా మేను ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాం. అదే అతనిపై ప్రేమ పెరిగేలా చేసింది” అని తాప్సీ తెలిపింది.
“నేను అతనిని ప్రేమిస్తున్నాను. కానీ అతనితో ప్రేమలో ఒక నెలలో లేదా అప్పటికప్పుడు మాత్రం జరగలేదు. అయితే, ఆయన గురించి నేను చాలా ఇంటర్వ్యూలలో పదేపదే చెప్పే మాట నిజమే. ఆయన్ని కలిసినప్పుడు నేను ఒక మగాడిని కలిసినట్లు, నాకంటూ ఒకరు ఉన్నారని అనిపించింది” అని తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది.
ఇంటర్వ్యూలో తాప్సీ ఇంకా మాట్లాడుతూ.. “నేను అతని కంటే ముందు చాలా మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ, అకస్మాత్తుగా నేను ఇంతకు ముందు ఎవరిని కలవనట్లు, ఎవరితో లేనట్లు ఫీలింగ్ కలిగింది. నాతో ఇంతకుముందు ఉన్న వ్యక్తిలా నాకు అనిపించలేదు. ఆ క్షణంలో సడెన్‌గా నాకు సెక్యూరిటీ, మెచ్యురీటీ వచ్చింది. అది నాకు చాలా స్పష్టంగా కనిపించింది. చివరికి నేను ఎవరిని పొందాను అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను” అని తాప్సీ పేర్కొంది.
ఇదిలా ఉంటే, తాప్సీ, మథియాస్ బోల వివాహానికి సంబంధించిన మొదటి వీడియో రెడిట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వేడుకకు తాప్సీ ఎరుపు రంగు సూట్, భారీ ఆభరణాలు ధరించింది. మథియాస్ షేర్వానీ, పగ్డీ ధరించాడు. వర్మల వేడుక అనంతరం ఈ జంట డ్యాన్స్ చేసి, కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నారు. మార్చి 23న ఉదయ్‌పూర్‌లో తాప్సీ మథియాస్‌ను వివాహం చేసుకుంది. మార్చి 20 నుంచి తాప్సీ, మథియాస్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
కాగా తాప్సీ పన్ను చివరిసారిగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన డంకీ చిత్రంలో నటించింది. ఇక తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ కొంతకాలం పాపులర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో కనుమరుగై హిందీలో క్రేజీ హీరోయిన్గా పాపులర్ అయింది.