Best Web Hosting Provider In India 2024
Rana Daggubati Role In Navdeep Love Mouli: సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించిన సినిమా లవ్ మౌళి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి దర్శకదిగ్గజం డైరెక్టర్ రాజమౌళి శిష్యుడు అవనీంద్ర డైరెక్షన్ చేశారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని లవ్ మౌళి సినిమా ఇవాళ అంటే జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చెప్పకపోడానికి కారణం
ఇదిలా ఉంటే, లవ్ మౌళి సినిమా పై జోరుగా ప్రచారం చేశారు. కానీ, మూవీ రిలీజ్‌కు ముందు రోజు మాత్రం ఊహించని మ్యాటర్ లీక్ చేశాడు హీరో నవదీప్. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నవదీప్ లవ్ మౌళి సినిమాలో రానా దగ్గుబాటి కెమియో రోల్ చేసినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్ని రోజులు చెప్పకపోవడానికి గల కారణం కూడా వివరించాడు హీరో నవదీప్.
23 ఏళ్ల నుంచి
“లవ్ మౌళి సినిమా నా పర్సనల్ లైఫ్‌కు దగ్గరగా ఉంటుంది. నా రియల్ లైఫ్‌లో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. 23 ఏళ్ల నుంచి రకరకాల మనుషులను ప్రేమించాను. పర్సనల్‌గా కూడా ఈ మూవీ కథ నాకు ఎంతో కనెక్ట్ అయింది. డైరెక్టర్ వ్యక్తిగత అనుభవాలు కూడా సినిమాలో పెట్టాడని అనిపించింది. ఆయన ఆలోచనలకు చాలా దగ్గరిగా సినిమా ఉంటుంది” అని హీరో నవదీప్ తెలిపాడు.
సరదాగా రానాకు చెప్పాను
“మనం ఏంటో తెలుసుకుని ప్రశాంతగా ఉండి.. అవతలి వాళ్లను కూడా ప్రశాంతంగా ఉంచితే బాగుంటుందనే కాన్సెప్ట్‌తోనే లవ్ మౌళి ఉంటుంది. ఈ కథను సరదాగా రానాకు చెప్పాను. కథ బాగుందని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో అఘోరా పాత్రలో రానా నటించాడు. నా కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే రానా అఘోరాగా నటించాడు” అని నవదీప్ చెప్పుకొచ్చాడు.
రానా చేయకుంటే
“సాధారణంగా రానాకు ఈ పాత్ర చేయడం అవసరం లేదు. కానీ, నాతో ఉన్న స్నేహం కోసమే అఘోరా పాత్రను చేశాడు రానా. ఈ రోజు వరకు కూడా రానా ఈ సినిమాలో నటించాడని రివీల్ చేయలేదు. ఎందుకంటే రానా ఓ పాత్ర చేశాడని కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ అఘోరా రోల్‌ను రానా చేయకుంటే డైరెక్టర్ అవనీంద్ర చేసేవాడు” అని నవదీప్ అసలు మ్యాటర్ చెప్పాడు.
అమ్మాయిలకు నచ్చుతుంది
అంతేకాకుండా లవ్ మౌళి సినిమా రెగ్యులర్ స్టోరీ కాదని, అందరికీ కొత్త అనుభూతినిస్తుందని నవదీప్ తెలిపాడు. ఎక్కడా కూడా రొటిన్‌గా ఉండి బోర్ కొట్టదని గట్టి నమ్మకంతో చెప్పాడు నవదీప్. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, మరి ముఖ్యంగా యూత్‌కు, అమ్మాయిలకు నచ్చుతుందని నవదీప్ అన్నాడు.
చూసే కోణం మారేదేమో
లవ్ మౌళి కేవలం తెలుగులోనే కాకుండా మరే ఇతర భాషల్లో అయినా వచ్చి ఉంటే చూసే కోణంలో కూడా తేడా ఉండేదేమో అని నవదీప్ చెప్పాడు. ఇదిలా ఉంటే, లవ్ మౌళి సినిమాను నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ నిర్మించింది.
కాగా సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న లవ్ మౌళి మూవీకి ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఇక ఈ సినిమాలో పంఖురి గిద్వానీ, చార్వీ దత్తా, భావనా సాగి హీరోయిన్స్‌గా చేశారు.