Best Web Hosting Provider In India 2024
Tenant Telugu OTT:టాలీవుడ్ కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా నటించిన టెనెంట్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి వై యుగంధర్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టెనెంట్‌ను ఓటీటీలో రిలీజ్ చేశారు.
ఇద్దరు హీరోయిన్లు…
ఊరి పేరు పొలిమేర 2 సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ టెనెంట్ మూవీలో హీరోగా నటించాడు. టీజర్స్, ట్రైలర్స్‌తో టెనెంట్ మూవీపై తెలుగు ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ఈ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించడంలో విఫలమైంది.
టెనెంట్ మూవీలో మేఘా చౌదరి, చందనా పయ్యాపుల హీరోయిన్లుగా నటించారు. ఎస్తేర్ నోర్హానా పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించింది.
టెనెంట్ మూవీ కథ ఇదే…
గౌతమ్ (సత్యం రాజేష్) తన మరదలు సంధ్యను (మేఘా చౌదరి) పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లో కాపురం పెడతాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోకుండా విభేదాలు ఏర్పాడుతాయి. సంధ్యను హత్యకు గురవుతుంది. అదే రోజు గౌతమ్ పక్క ఫ్లాట్‌లో ఉండే రిషి (భరత్ కాంత్) కూడా బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. రిషి ని ప్రేమించిన వైష్ణవి (చందన) కనిపించకుండా పోతుంది?
సంధ్యను హత్య చేసినందుకు పోలీసులను గౌతమ్‌ను అరెస్ట్ చేస్తారు. నిజంగానే సంధ్యను గౌతమ్ హత్య చేశాడా? రిషి, సంధ్యకు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసు వెనకున్న మిస్టరీని ఏసీపీ (ఎస్తేర్ నోర్హానా) ఎలా ఛేదించింది అన్నదే ఈ మూవీ కథ. మత్తు పదార్థాలకు బాసినగా మారి కొందరు తమ జీవితాల్ని ఎలా పాడుచేసుకుంటున్నారనే సందేశంతో దర్శకుడు యుగంధర్ ఈ మూవీని తెరకెక్కించాడు.
కమెడియన్‌గా 300 సినిమాలు
సత్యం మూవీతో టాలీవుడ్‌లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు సత్యం రాజేష్. ఆ మూవీ హిట్టవ్వడంతో అదే అతడి ఇంటిపేరుగా మారిపోయింది. తెలుగులో హీరో స్నేహితుడిగా, కమెడియన్‌గా 300లకుపైగా సినిమాలు చేశాడు. హీరోగా మా ఊరి పొలిమేర, మా ఊరి పొలిమేర2 సినిమాల్లో కనిపించాడు.
చేతబడుల నేపథ్యంలో హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా హిట్టయ్యాయి. మా ఊరి పొలిమేర ఓటీటీలో రిలీజవ్వగా, పొలిమేర 2 థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అడివి శేష్ క్షణంలో పోలీస్ ఆఫీసర్‌గా సీరియస్ రోల్‌లో సత్యం రాజేష్ మెప్పించాడు.
టాపిక్