OG OTT Rights: పవన్ కల్యాణ్ ఓజీ మూవీ ఓటీటీ హక్కులకు కళ్లు చెదిరే మొత్తం.. వచ్చే ఏడాదే..

Best Web Hosting Provider In India 2024

OG OTT Rights: పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ ఓటీటీ హక్కులకు అతని కెరీర్లోనే అతిపెద్ద మొత్తం లభిస్తోంది. ఈ సినిమాపై నెలకొన్న బజ్ కారణంగా డిజిటల్ హక్కులకు కూడా అదే స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. ఓటీటీలోకి మాత్రం వచ్చే ఏడాదే రానున్నట్లు తెలుస్తోంది.

ఓజీ ఓటీటీ హక్కులు

గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ఆ ప్లాట్‌ఫామ్ ఏకంగా రూ.92 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన 45 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ ఓజీ మూవీ మాత్రం ఈ ఏడాది వచ్చే అవకాశాలు కనిపిండం లేదు.

వచ్చే ఏడాదే నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సినిమా వస్తున్నట్లు సమాచారం. మరోవైపు మూవీ రిలీజ్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మూవీలో ఇంకా పవన్ కల్యాణ్ షూటింగ్ కొంత మిగిలి ఉంది. చాలా రోజులుగా ఎన్నికల్లో బిజీగా ఉన్న కారణంగా అతడు షూటింగులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి.

పవన్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు అతని జనసేన పార్టీకి చెందిన మొత్తం 21 మంది విజయం సాధించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలోనూ పవన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఓజీతోపాటు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల షూటింగ్ లను పవన్ ఎప్పుడు పూర్తి చేస్తాడన్నది తెలియడం లేదు. ఒకవేళ పవన్ పార్ట్ షూటింగ్ ఆలస్యమైతే మాత్రం ఓజీ రిలీజ్ కూడా వాయిదా పడవచ్చు.

ఓజీ నుంచి పవన్ పోస్టర్

ఓజీ మూవీ నుంచి ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన రోజే ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రివేంజ్ అంటూ పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్తగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేదు. దీంతో సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది.

ఇక మూవీకి ఓజీ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని డైరెక్టర్ సుజీత్ ఈ మధ్యే వెల్లడించాడు. ‘ఓజాస్ గంభీర’ను ఓజీగా పెట్టినట్టు తెలిపారు. ఓజాస్ అంటే మాస్టర్ అనే అర్థమని, గంభీర అనేది పవన్ క్యారెక్టర్ పేరు అని సుజీత్ వివరించారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ మాస్టర్ అని అన్నారు.

అలా ఓజాస్ గంభీరను ఓజీగా పెట్టామని తెలిపారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్ అని కూడా కలిసి వస్తుందని.. అందుకే ఆ టైటిల్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అంటే, ఈ మూవీలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‍స్టర్‌గానూ, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌గానూ కనిపిస్తారని అర్థమవుతోంది. ఈ మూవీలో జపనీస్ రెఫరెన్సులు ఎక్కువగా ఉంటాయని సుజీత్ అన్నారు. ఓజీ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ ఏం చెబుతారో చూడాలి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024