Sooseki song kpop dance: సూసేకి సాంగ్‌పై కొరియన్ పాప్ గ్రూప్ డ్యాన్స్.. రష్మిక రియాక్షన్ ఇదీ

Best Web Hosting Provider In India 2024


Sooseki song kpop dance: పుష్ప 2 మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ సూసేకి పాటపై కొరియన్ పాప్ సింగర్ ఆవూరా, అతని గ్రూప్ వేసిన స్టెప్పులపై రష్మిక మందన్నా స్పందించింది. రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. సూసేకి అంటూ సాగిపోయిన ఈ కపుల్ సాంగ్ ఇండియాలోనే కాదు కొరియాలోనూ ఊపేస్తోంది.

సూసేకి పాటపై కే-పాప్ డ్యాన్స్

కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్, సాంగ్స్ ఈ మధ్య ఇండియన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో ఈ కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంటోంది. అయితే ఇప్పుడు మన తెలుగు పాట కొరియన్లను స్టెప్పులేసేలా చేస్తోంది. పుష్ప 2 మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సూసేకి పాట సూపర్ హిట్ అయిన విషయం తెలుసు కదా.

ఈ కపుల్ సాంగ్ లోని స్టెప్పులు అందరికీ ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్, రష్మిక వేసిన క్యూట్ స్టెప్పులను చాలా మంది రీల్స్ చేస్తున్నారు. తాజాగా కే-పాప్ సింగర్ ఆవూరా, అతని గర్ల్ గ్రూప్ ఈ పాటకు డ్యాన్స్ చేశారు. పార్క్ మిన్-జున అలియాస్ ఆవూరా ఈ పాటకు వేసిన స్టెప్పుల వీడియో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ చూసిన రష్మిక మందన్నా.. అగ్గి పుట్టించారనేలా రెండు ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేసింది.

ఈ కొరియన్ పాప్ సింగర్ ఆవూరా బిగ్ బాస్ 17లోనూ పార్టిసిపేట్ చేశాడు. ఈ వీడియోనే అతడే తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం విశేషం. అందులో ఈ.షా, నిజ్, నోవా, హన్నా, ఆరియాలు ఈ పాటపై డ్యాన్స్ చేశారు. సూసేకి హిందీ వెర్షన్ బ్యాక్‌గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. “కేపాప్ సామి విత్ కేపాప్ శ్రీవల్లి” అనే క్యాప్షన్ తో వీడియో పోస్ట్ చేశారు.

సూసేకి సాంగ్

పుష్ప 2 మూవీ నుంచి పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మాస్ సాంగ్ తర్వాత సూసేకి అంటూ ఓ మెలోడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషాల్ ఏకంగా ఆరు భాషల్లో పాడింది. పుష్ప మూవీలో శ్రీవల్లి పాట ఎంతలా ఊపేసిందో ఇప్పుడీ సూసేకి కూడా అదే రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ఈ పాటకు గణేష్ ఆచార్య చేసిన కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇందులోని హుక్ స్టెప్ ను ట్రై చేస్తూ ఎంతో మంది రీల్స్ చేస్తున్నారు. తాజాగా కేపాప్ సింగర్స్ చేసిన డ్యాన్స్ వీడియోను పుష్ప మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్లోనూ షేర్ చేశారు. పుష్పరాజ్, శ్రీవల్లి పాత్రల్లో మరోసారి పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. మరి పుష్ప రేంజ్ లోనే ఈ పుష్ప 2 కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

IPL_Entry_Point


Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024