Bogatha Waterfalls Tour : ‘బొగత వాటర్‌ ఫాల్స్‌’ వెళ్లొద్దామా..! అతి తక్కువ ధరలో వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే

Best Web Hosting Provider In India 2024

Hyderabad – Bogatha waterfalls Tour Package : అతి తక్కువ ధరలోనే అనేక రకాల టూర్ ప్యాకేజీలను తెలంగాణ టూరిజం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రకృతి పర్యాటకానికి పేరొందిన పలు ప్రాంతాలకు ఇప్పటికే పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తుండగా… ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేందుకు కూడా ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

కేవలం ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. నాన్ ఏసీ కోచ్ లో జర్నీ ఉంటుంది. వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపేరట్ చేస్తున్నారు. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ వివరాలను తెలుసుకోవచ్చు. బుకింగ్ కూడా చేసుకోవచ్చు,

హైదరాబాద్ – బొగత టూర్ ప్యాకేజీ వివరాలు :

  • హైదరాబాద్ నుంచి బొగతకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
  • BOGATHA WATERFALLS – Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • కేవలం ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. నాన్ ఏసీ కోచ్ బస్సులో హైదరాబాద్ నుంచి బొగతకు వెళ్తారు.
  • ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లో జర్నీ ప్రారంభం అవుతుంది. రాత్రి 11.30 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • ప్రతి శని, ఆదివారాల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • టికెట్ ధరలు: పెద్దలు రూ. 1600, చిన్నారులు రూ. 1280
  • అధికారిక వెబ్ సైట్ – https://tourism.telangana.gov.in/
  • హైదరాబాద్ బొగత టూర్ ప్యాకేజీ లింక్ – https://tourism.telangana.gov.in/package/bogathawaterfalls

ములుగు జిల్లాలో బొగత జలపాతం ఉంటుంది. తెలంగాణ నయాగారాగా కూడా దీనికి పేరుకుంది. ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధమనోహరంగా మారింది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి పర్యాటకులు మురిసిపోతుంటారు.

మొన్నటి వరకు ఎండల తీవ్రత ఉండగా.. నీటి ప్రవాహం పెద్దగా లేదు. అయితే నైరుతి రుతుపవనాల రాకతో… మళ్లీ బొగతకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. క్రమంగా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంటోంది. సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా తరలివస్తుంటారు.

నాగార్జున సాగర్ టూర్ ప్యాకేజీ

మరోవైపు నాగార్జున సాగర్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ముగుస్తుంది.

కేవలం ఒకే ఒక్క రోజులోనే సాగర్ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్తారు. ఈ ప్యాకేజీ షెడ్యూల్ చూస్తే…. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ పర్యాటక భవన్ నుండి, 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.

ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. . త‌ర్వాత‌ లంచ్ బ్రేక్ ఉంటుంది.ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను సంద‌ర్శ‌ిస్తారు. 5 గంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ వన్ డే టూర్ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 800, పిల్లలకు 640గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.(

IPL_Entry_Point

టాపిక్

Telangana TourismTelangana NewsTravelTourismAp TourismMulug Assembly Constituency
Source / Credits

Best Web Hosting Provider In India 2024