Best Web Hosting Provider In India 2024
Saturday Motivation: అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ భార్యగా మాత్రమే నీతా అంబానీని ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటారు. ఆమె ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆమె కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే కుటుంబ వ్యాపారాలను కూడా అంతే విజయవంతంగా నిర్వహిస్తుంది. సమాజానికి సహాయం చేయాలని లోతైన సంకల్పాన్ని ఆమె కలిగి ఉంటుంది. రిలయన్స్ ఫౌండేషన్, ఫుట్ బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్, ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్ పర్సన్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టుకు సహాయజమాని ఇలా ఎన్నో వృత్తిగత పనులతో ఆమె చాలా బిజీగా ఉంటుంది. అయినా కూడా తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని మాత్రం పక్కన పెట్టదు.
భర్త ముకేశ్ అంబానీలాగే నీతా అంబానీ కూడా ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త. నీతా అంబానీకి వ్యాపార నైపుణ్యాలు ఎక్కువే, ఆ నైపుణ్యాలతో అసాధారణమైన సంబంధాలను దేశంలో ఏర్పరచుకున్నారు. ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్నమైన మహిళల్లో ఒకరిగా ఉన్నారు.
ఆమె నుంచి నేటితరం మహిళలు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆమెకు ముగ్గురు పిల్లలు. వృత్తి గత జీవితంలో ఎంత బిజీగా మారినా, వ్యక్తిగతంగా మాత్రం ఆమె తన పిల్లలను ఎప్పుడూ పక్కన పెట్టలేదు. వృత్తి గత జీవితంలోని అనుబంధాలతో పాటు, వ్యక్తిగత జీవితంలోని అనుబంధాలను ఆమె చాలా బ్యాలెన్స్‌డ్ గా నిర్వహించుకుంటూ వచ్చారు. తన భర్తకు సరైన జీవిత భాగస్వామి అనిపించుకున్నారు.
ఆమె తన భాగస్వామికి తన పిల్లలకు ఎంతో విలువను ఇస్తారు. అలాగే భర్తతో పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. వారికి సంతోషాన్ని కలిగించే పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బలమైన కుటుంబ బంధం ఏర్పడింది. ఎంతో సంతోషకరమైన కుటుంబం అని అందరికీ తెలుసు. ఆ సంతోషం వెనుక నీతా అంబానీ ఎంతో బలమైన పునాదులను వేశారు. తన పిల్లలైన ఈషా , ఆకాష్, అనంత్ అంబానీలను ఒకే తాటిపైన నిలిచేలా చేశారు. వారి ఎల్లప్పుడూ కలిసి ఉండేలా పెంచారు. ఒకరికొకరు మద్దతు ఇచ్చేలా పెంచారు. తల్లిగా ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైనది. నీతా అంబానీ తన పిల్లల్లో ప్రతి ఒక్కరూ తమ కోరుకున్నది సాధించడానికి సమానమైన అవకాశాలను అందించారు.
తన భర్తతో పాటు ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య మంచి సమతుల్యతను ఉండేలా చూసుకున్నారు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడమే కాదు, తమ ఉద్యోగులతో కూడా ఆమె ఇంటరాక్ట్ అయ్యే విధానం ఎంతోమందికి మార్గదర్శకం.
ఎంత డబ్బు ఉన్నా ఆమెలో వినయం, విధేయతా ఎక్కువ. వారి పిల్లల జీవితాల పై కూడా ఆమె ప్రభావం ఎంతో పడింది. వారు కూడా వినయపూర్వకంగానే ఉంటారు. తల్లి బాటలోనే నడుస్తారు. నీతా అంబానీ ఎంత బిజీగా ఉన్నా… తన పిల్లలపై ఒక కన్నేసి కచ్చితంగా ఉంటుంది. వారి పిల్లల జీవితాల్లోకి ఇతరులు చొరబడకుండా, ఎలాంటి చెడు వ్యసనాలు రాకుండా ఆమె చాలా జాగ్రత్త పడ్డారు. వారి కార్యాకలాపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వంటి పద్ధతులను పాటించారు.
ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా… తమ పిల్లలు భారతీయ వారసత్వానికి విలువని ఇచ్చేలా పెంచారు. సంస్కృత వేడుకలు, ఆచారాలు కచ్చితంగా పాటించేలా చేశారు.
నేటి మహిళలు నీతా అంబానీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే ఇక్కడ ఇవ్వగలిగాము. ఎంత ఆస్తి ఉన్నా కూడా ఒదిగి ఉండడమే ఆమెలోని గొప్పతనం.