Best Web Hosting Provider In India 2024
Chaparai Water Falls : రుతుపవనాల పలకరింపుతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. దీంతో కొండ కోనల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కొండలపై కురుస్తున్న వర్షాలతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాపరాయి జలపాతం ఈ వర్షాకాలంలో చూడదగిన ప్రాంతం. ఆంధ్రా ఊటీ అరకు పర్యటక ప్రదేశానికి 15 దూరంలో చాపరాయి జలపాతం ఉంది. దీనిని డుంబ్రిగుడా జలపాతాలు అని కూడా పిలుస్తారు. చుట్టూ అడవులు మధ్యలో జలపాతంతో సుందరమైన ప్రదేశం.
ఏటవాలు ప్రవాహాలు
చాపరాయి జలపాతాలు ఒక ప్రసిద్ధమై పర్యాటక ప్రదేశం. అరకు లోయలో జలపాతాల్లో ఇదొకటి. విశాలమైన కొండల గుండా ప్రవహించే అందమైన ప్రవాహం. జలపాతాల చుట్టూ ఉన్న ప్రాంతం పిక్నిక్‌లకు ప్రసిద్ధి. వేసవితో పాటు వర్షాకాలంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. కొండ రాళ్లపై ఏటవాలుగా జలపాతాలు చూడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వారాంతాల్లో చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ జలపాతం తెలుగు సినిమా నిర్మాతలు ఇష్టపడే ప్రదేశాలలో ఒకటిగా చెబుతారు. సహజ శిలల గుండా ప్రవహించే నీటి అందాలను ఆస్వాదించేందుకు చాలా అద్భుతంగా ఉంటాయి. నీటి ప్రవాహం ఎక్కువగా లేనప్పుడు పర్యాటకులు జలపాతం వద్ద స్నానం చేయడానికి సాధ్యపడుతుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి దిగవద్దని భద్రతా సిబ్బంది తెలియజేస్తారు.
పిక్నిక్ స్పాట్
పర్యాటకులు అరకు నుంచి సొంత వాహనాలు లేదా టాక్సీ/ఆటో అద్దెకు తీసుకొని చాపరాయి జలపాతాన్ని సందర్శించవచ్చు. చాపరాయి నీటి జలపాతాలు, అటవీ ప్రాంతాలతో సుందరమైన టూరిస్ట్ స్పాట్. ప్రజలు ప్రశాంతంగా వారి సెలవులను ఆస్వాదించేందుకు ఇక్కడకు వస్తుంటారు. అరకు లోయను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా చాపరాయి జలపాతం సందర్శించేందుకు వస్తారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశం చుట్టూ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గర్లో కాఫీ తోటలు ఉన్నాయి.
చాపరాయి జలపాతానికి ఎలా చేరుకోవాలి?
ఏపీ టూరిజం ఒకరోజు అరకు టూర్ ప్యాకేజీ అందిస్తుంది. అయితే ఇందులో డుంబ్రిగూడ చాపరాయి జలపాతం సందర్శన లేదు. టూరిస్టులు అరకు నుంచి తమ సొంత వాహనాలు లేదా టాక్సీ/ఆటో అద్దెకు తీసుకొని ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. అరకు లోయ నుంచి పాడేరు వెళ్లే మార్గంలో చాపరాయి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది . అరకు నుంచి చాపరాయికి రోడ్డు అందుబాటులో ఉంది. అరకు లోయ వరకు రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. పర్యాటకులు విశాఖపట్నం నుంచి అరకు లోయకు చేరుకోవడానికి కిరండోల్ ప్యాసింజర్ రైలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయాణంలో టూరిస్టులు లోయలు, సొరంగాలు, వంతెనల వంటి సుందరమైన అందాలను ఆస్వాదిస్తారు. అరకు లోయ, బొర్ర గుహలు, పద్మాపురం గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ ఎస్టేట్స్, గాలి కొండలు ఈ ప్రాంతంలో చూడదగిన ప్రదేశాలు.
లోకేషన్ వివరాలు : https://t.co/Gsrib1zlg1
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్