Ramoji Rao: ఒక్క ‘చిత్రం’తో ఐదుగురి పరిచయం.. డైరెక్టర్ హీరో హీరోయిన్ సింగర్‌తో సహా! ఏకైక నిర్మాతగా రామోజీరావు ఘనత

Best Web Hosting Provider In India 2024


Ramoji Rao Produced Film Chitram: మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. శనివారం ఉదయం 4: 50 గంటలకు గుండె సంబంధిత సమస్యకు చికిత్స పొందుతున్న ఆయన చివరి శ్వాస విడిచారు. చిరంజీవి నుంచి శ్రీవిష్ణు వరకు ప్రముఖ సినీ నటులు, రాజకీయ వేత్తలు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

80కిపైగా చిత్రాలు

ఇదిలా ఉంటే, రామోజీరావు నిర్మాతగా అనేక హిట్ సినిమాలను అందించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై 80కిపైగా చిత్రాలను ఆయన నిర్మించారు. అయితే, ఆయన చేసిన ప్రతి సినిమాతో కనీసం ఒక్కరినైనా కొత్తవారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఓ మూవీతో హీరోను ఇంట్రడ్యూస్ చేస్తే మరో సినిమాతో హీరోయిన్, ఇంకో చిత్రంతో డైరెక్టర్ ఇలా కొత్త వారిని ఎంకరేజ్ చేశారు.

42 లక్షల బడ్జెట్-12 కోట్ల కలెక్షన్స్

అలాంటిది ఒకే ఒక్క సినిమాతో ఏకంగా ఐదుగురిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు నిర్మాత రామోజీరావు. ఆ సినిమా పేరే చిత్రం. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో తెలిసిందే. కేవలం రూ. 42 లక్షల బడ్జెట్‌తో తెరెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 12 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

డైరెక్టర్‌గా తేజ

2000, మే 25న చిత్రం సినిమాతో డైరెక్టర్ నుంచి సింగర్ వరకు ఐదుగురు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో మొదటగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ తేజ (Teja). సినిమాటోగ్రాఫర్ అయిన తేజకు చిత్రం సినిమాతో దర్శకుడిగా మారే అవకాశం ఇచ్చారు రామోజీరావు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్‌గా తేజ పాపులర్ అయ్యారు. మహేశ్ బాబు, దగ్గుబాటి రానాతోపాటు పలువురు కొత్తవారితో సినిమాలు తెరకెక్కించారు డైరెక్టర్ తేజ.

హీరోగా ఉదయ్ కిరణ్

చిత్రం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్ (Uday Kiran). తమిళ సినిమాల్లో నటుడిగా చేస్తున్న ఉదయ్ కిరణ్‌ చిత్రం మూవీతో తెలుగులో హీరోగా మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత నువ్వే నువ్వే, మనసంతా నువ్వే సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. దాంతో ఎంట్రీతోనే హ్యాట్రిక్ కొట్టిన హీరోగా ఉదయ్ కిరణ్ నిలిచిపోయాడు.

రీమా సేన్

మోడల్ అయిన రీమా సేన్ (Reema Sen) తెలుగులో చిత్రం సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. ఆ తర్వాత తమిళం, హిందీ సినిమాలతో బిజీగా మారింది. అలాగే యాక్టర్ అయినటువంటి సందీప్‌ ఈ మూవీతో సింగర్‌గా మారాడు. ప్రేమాయనమః, ఇంకోసారి చిత్రాల్లో నటించిన సందీప్ టాలీవుడ్, బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఎదిగాడు. అలాగే పాపులర్ టీవీ షో అయిన జీ సరెగమపకు యాంకర్‌గా వ్యవహరించాడు.

చిత్రం శ్రీను

చిత్రం మూవీతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మూవీ నేమే తన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత దాదాపుగా 260కిపైగా సినిమాల్లో నటుడిగా చిత్రం శ్రీను అలరించాడు. ఇలా ఒక్క సినిమాతో ఐదుగురిని పరిచయం చేసిన నిర్మాతగా రామోజీరావు ఘనత సాధించారు. వీళ్లే కాకుండా, జూనియర్ ఎన్టీఆర్, శ్రీయ సరన్, జెనిలీయా, రితేష్ దేశ్ ముఖ్, తరుణ్, యామీ గౌతమ్, ఆకాష్ తదితరులను రామోజీ రావు ఇంట్రడ్యూస్ చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024