Best Web Hosting Provider In India 2024
AP TG Rain Updates : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి రానున్న మూడు రోజులు ఏపీలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, షియర్ జోన్ ఉన్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. రానున్న రెండు రోజుల్లో నైరుతు రుతుపవనాలు శ్రీకాకుళాన్ని తాకనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోవు మూడు రోజులు వర్షాలు
- ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి – ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది .ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటరు వేగంతో వీచే అవకాకాశం ఉంది.
- దక్షిణ కోస్తాంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి -ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
- రాయలసీమ : రానున్న మూడు రోజులు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్
తెలంగాణలో నేటి నుంచి రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. అత్యవసర సమయాల్లో 040-21111111, 9001136675 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.
రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 10, 11న నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు, మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణతో పాటు మిగిలిన కోస్తాంధ్రలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్