Best Web Hosting Provider In India 2024
AP Garbage Tax : రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు అవుతుందా? అంటే అందుకు అవుననే వార్తాలు వినిపిస్తున్నాయి. కొత్తగా రాబోతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెత్తపన్ను వసూలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయొద్దని పట్టణ, నగర పాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వసూళ్లు నిలిపివేయాలని పేర్కొన్నారు. దీంతో ఇప్పటి నుంచి పన్ను వసూళ్లు నిలిచిపోనున్నాయి.
వైసీపీ హయాంలో
అధికారంలోకి వచ్చిన తరువాత చెత్త పన్నును రద్దు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసేది. ఇలా ఏటా రూ.200 కోట్లు వసూలు చేసేది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నుంచి చెత్తను సేకరించడాన్ని 2021 అక్టోబర్ లో ప్రవేశపెట్టారు. దీనిపై చెత్త పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. చెత్తను సేకరించడానికి 2,164 ఆటోలు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో 48 కార్పొరేషన్, మున్సిపాలిటీలకు కేటాయించారు. ప్రజల నుంచి పన్ను వసూలు చేసి, ఒక్కో వాహనానికి నెలకు రూ. 65 వేలు ఇవ్వాలని కార్పొరేషన్, మున్సిపాలిటీల కమిషనర్లకు రాష్ట ప్రభుత్వం ఆదేశించింది.
చెత్త పన్ను వసూలు చేయమని హామీ
దీనికి వ్యతిరేకంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో కూడా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆందోళనలు జరిగాయి. అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ ప్రభుత్వం రాగానే చెత్త పన్ను వసూలు చేయమని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు డబ్బులు పంచడంతో రాష్ట్ర ఖజానాపై ఒత్తిడిపై ఆదాయ మార్గాల్ని వెతికి , చెత్త పన్ను పేరుతో కొత్త పన్నును తెచ్చింది. ఇళ్లకు రూ.30 నుంచి మొదలుపెట్టి ఆస్పత్రులకు వేలల్లో చెత్త పన్నులు వసూలు చేసేవారు. వీటిని తప్పనిసరిగా వసూలు చేయాలని మున్సిపల్ సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టారు. చెత్తపన్నుపై ప్రజాగ్రహం పెరిగింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్