వైయ‌స్ఆర్‌సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె

Best Web Hosting Provider In India 2024

 

అనకాపల్లి జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ  ఓటమిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.

అప్పటి  నుంచి  దిగాలుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటివద్ద గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Best Web Hosting Provider In India 2024