Best Web Hosting Provider In India 2024
TS Inter Admissions 2024-25 : ఇంటర్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి కీలక అలర్ట్ ఇచ్చింది. కేవలం ఇంటర్ బోర్డు అనుమతి పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలను పొందాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అనుమతులు లేని కాలేజీల్లో చేరితే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని… ఎగ్జామ్ ఫీజు చెల్లించే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. కేవలం అనుమతి ఉన్న కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని పేర్కొంది. అయితే ఏఏ కాలేజీలకు అనుమతులు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు కాలేజీల జాబితాను వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది. https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కాలేజీల లిస్ట్ ను చెక్ చేసుకోవచ్చని పేర్కొంది.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్
Ts IntermediateTs Inter Results 2024Telangana NewsAdmissions