Brahmamudi Promo: పెళ్లి పీట‌ల‌పై రాజ్ – ఓడిపోనివ్వ‌న‌ని భ‌ర్త‌కు మాటిచ్చిన కావ్య – కాలేజీకి దూర‌మైన వ‌సుధార‌

Best Web Hosting Provider In India 2024


Brahmamudi Promo: దొంగ మాయ స‌హాయంతో దుగ్గిరాల ఇంటి ప‌గ్గాల‌ను చేజిక్కించుకోవాల‌ని రుద్రాణి అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. రుద్రాణితో పాటు రాహుల్‌ల‌కు ఎదురుతిరుగుతుంది మాయ‌. పెళ్లికి ముందే ఇంట్లో నుంచి జంప్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ఆమెను రుద్రాణి, రాహుల్ అడ్డుకుంటారు. న‌న్ను అడ్డుకుంటే మీ బాగోతం మొత్తం బ‌య‌ట‌పెడ‌తాన‌ని వార్నింగ్ ఇస్తుంది.

 

రాజ్ ప్లాన్ రివ‌ర్స్‌…

త‌న వార్నింగ్‌కు దొంగ మాయ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంద‌ని రాజ్ అనుకుంటాడు. కానీ అత‌డి ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అవుతుంది. మాయ ఇంట్లోనే తిష్ట‌వేస్తుంది. మాయ‌తో రాజ్ పెళ్లికి సిద్ధ‌మ‌వ్వ‌డం ఇందిరాదేవి జీర్ణించుకోలేక‌పోతుంది. రాజ్‌కు క్లాస్ ఇస్తుంది. కావ్య‌కు అన్యాయం చేయ‌ద్ద‌ని వేడుకుంటుంది.

 

షాకిచ్చిన మాయ‌…

మాయ తండ్రిని అడ్డం పెట్టుకొని ఆమెను ఇంట్లో నుంచి పంపించేయాల‌ని రాజ్ అనుకుంటాడు. కానీ రాజ్‌కే షాక్ ఇస్తుంది మాయ‌. రాజ్‌కు తెలియ‌కుండా త‌న తండ్రిని దేశాన్ని దాటించేస్తుంది మాయ‌. త‌న మెడ‌లో తాళి క‌ట్ట‌డం మిన‌హా మ‌రో దారి లేద‌ని రాజ్‌తో అంటుంది మాయ‌.

 

అప‌ర్ణ ఫైర్‌…

రాజ్‌, మాయ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటుంది అప‌ర్ణ‌. ఇష్టం లేక‌పోయినా పెళ్లి కూతురిగా మాయ‌ను రెడీ చేయిస్తుంది. అప‌ర్ణ ముందు మార్కులు కొట్టేయ‌డానికి రాజ్ త‌న‌తో రొమాంటిక్‌గా ఉన్న‌ట్లు నాట‌కం ఆడుతుంది మాయ‌. ఆమె యాక్టింగ్‌ను చూసి అప‌ర్ణ స‌హించ‌లేక‌పోతుంది. కానీ ఏం చేయ‌లేక ఊరుకుండిపోతుంది.

 

ధాన్య‌ల‌క్ష్మి రెడీ…

రాజ్‌, మాయ‌ల పెళ్లికి ధాన్య‌ల‌క్ష్మి రెడీ అవుతుంది. ఆ పెళ్లిని ఎలా ఆపాలో తెలియ‌క ప్ర‌కాశం ఆలోచిస్తుంటాడు. కానీ అప‌ర్ణ మాట‌కు ఎదురుచెప్ప‌లేక ఇద్ద‌రు మౌనంగా ఉండిపోతారు. మాయ‌ను ఇంట్లో నుంచి పంపించే దారుల‌న్నీ మూసుకుపోవ‌డంతో తాను ఓడిపోయాన‌ని కావ్య‌తో అంటాడు రాజ్. తాను ఏం చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ప‌డ్డాన‌ని చెబుతాడు. నువ్వు త‌ప్ప న‌న్ను గ‌ట్టెక్కించేవాళ్లు లేర‌ని కావ్య‌ను వేడుకుంటాడు. అమ్మ కోసం నేను బ‌లికాలేన‌ని, నా కోసం అమ్మ‌ను బ‌లిచేయ‌లేన‌ని కావ్య‌తో చెబుతాడు రాజ్‌. తాను ఉండ‌గా మిమ్మ‌ల్ని ఓడిపోనివ్వ‌న‌ని రాజ్‌కు మాటిస్తుంది కావ్య‌.

 

పెళ్లిపీట‌ల‌పై రాజ్‌…

పెళ్లి కొడుకుగా రెడీ అయినా రాజ్ పీట‌ల‌పై కూర్చుంటాడు. త‌న మెడ‌లో రాజ్ తాళిక‌ట్ట‌బోతుండ‌టంతో మాయ సంబ‌ర‌ప‌డుతుంది. అప్పుడే అప్పు ఫోన్ చేసి మాయ స్పృహ‌లోకి వ‌చ్చింద‌ని చెప్ప‌డంతో కావ్య కంగారుగాపెళ్లి వేడుక నుంచి హాస్పిట‌ల్‌కు బ‌య‌లుదేరుతుంది. ఆ త‌ర్వాత బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

 

ఎండీ సీట్ వ‌దిలిపెట్ట‌నున్న వ‌సుధార‌

రిషి క‌నిపించ‌డం లేద‌ని వ‌సుధార ఇచ్చిన పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఆమెను చిక్కుల్లో ప‌డేస్తుంది. చ‌నిపోయిన రిషి పేప‌ర్‌లో ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం ఏమిట‌ని వ‌సుధార‌ను మినిస్ట‌ర్‌తో కాలేజీ బోర్డ్ మెంబ‌ర్స్ త‌ప్పుప‌డ‌తారు. శైలేంద్ర కుట్ర‌లు చేసి కాలేజీకి ఎగ్జామినేష‌న్ సెంట‌ర్ రాకుండా చేస్తాడు. మ‌రోవైపు రిషిని తిరిగి తీసుకొస్తాన‌ని పెట్టిన గ‌డువు ముగియ‌డంతో ఎండీ సీట్‌ను వ‌దిలిపెట్టాల‌ని వ‌సుధార నిర్ణ‌యించుకుంటుంది? రిషి బ‌తికి ఉన్నాడ‌నే వ‌సుధార న‌మ్మ‌కం నిజ‌మైందా? అత‌డు తిరిగి వ‌చ్చాడా? ఎండీ సీట్‌తో పాటు కాలేజీకి వ‌సుధార‌ను దూరం కాకుండా కాపాడాడా లేదా అన్న‌ది తెలియిన నెక్స్ట్ గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

 

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024