Varun Tej Matka: నాలుగు గెట‌ప్‌ల‌లో మెగా హీరో వ‌రుణ్ తేజ్ -మ‌ట్కా మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్‌

Best Web Hosting Provider In India 2024


Varun Tej Matka: మెగా హీరో వ‌రుణ్‌తేజ్ సోలో హీరోగా హిట్టు అందుకొని దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌తో అత‌డు చేసిన గ‌ని, ఆప‌రేష‌న్ వాలెంటైన్‌తో పాటు గాంఢీవ‌దారి అర్జున సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి. వెంక‌టేష్‌తో క‌లిసి చేసిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఎఫ్ 3 మాత్రం వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి వ‌రుణ్‌తేజ్‌కు ఊర‌ట‌నిచ్చింది. సోలో హీరోగా హిట్టు అందుకోవాల‌ని ఎదురుచూస్తోన్న వ‌రుణ్‌తేజ్ ప్ర‌స్తుతం మ‌ట్కా మూవీ చేస్తోన్నాడు.

మ‌ట్కా అప్‌డేట్ ఇదే…

పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న మ‌ట్కా సినిమాకు ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ‌ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. జూన్ 19 నుంచి మట్కా నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఖ‌ర్చులో ఓ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం మేక‌ర్స్ దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

వ‌రుణ్‌తేజ్ మేకోవ‌ర్‌….

1958 నుంచి 1982 మ‌ధ్య కాలంలో మ‌ట్కా క‌థ సాగుతుంద‌ని తెలిసింది. ఇర‌వై నాలుగేళ్ల టైమ్ పీరియ‌డ్‌లో ఓ వ్య‌క్తి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? జైలు ఖైదీగా ఉన్న అత‌డు గ్యాంబ్లింగ్ మాఫియాకు ఏ విధంగా అధినేత‌గా ఎదిగాడ‌న్న‌ది మ‌ట్కా సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. నాలుగు గెట‌ప్‌ల‌లో..

మ‌ట్కాలో నాలుగు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో వ‌రుణ్‌తేజ్ క‌నిపిస్తార‌ని అంటున్నారు.. నెగెటివ్‌, పాజిటివ్ షేడ్స్‌తో ఛాలెంజింగ్‌గా వ‌రుణ్ తేజ్ పాత్ర సాగుతుంద‌ని చెబుతోన్నారు. 1980 ద‌శ‌కంలో యావ‌త్ దేశాన్ని కుదిపివేసిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా మ‌ట్కా మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం

నోరా ఫ‌తేహి, మీనాక్షి చౌద‌రి…

మ‌ట్కా సినిమాలో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫ‌తేహీతో పాటు మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తెలుగులో కిక్ 2 , లోఫ‌ర్‌, ఊపిరితో పాటు మ‌రికొన్ని సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసింది నోరా ఫ‌తేహి. మ‌ట్కా మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

గుంటూరు కారంతో ఈ ఏడాది తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన మీనాక్షి చౌద‌రి ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కాగా మ‌ట్కా సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో మ‌ట్కా రిలీజ్ కానుంది.

ప‌లాస‌తో ఎంట్రీ…

ప‌లాస 1978 మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు క‌రుణ‌కుమార్‌. సామాజిక అస‌మాన‌త‌ల్ని చ‌ర్చిస్తూ తెర‌కెక్కిన ఈ మూవీతో తొలి ప్ర‌య‌త్నంలోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్నాడు. ప‌లాస త‌ర్వాత శ్రీదేవిసోడా సెంట‌ర్‌, క‌ళాపురం అనే సినిమాలు చేసినా స‌క్సెస్ మాత్రం అందుకోలేక‌పోయాడు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024