Best Web Hosting Provider In India 2024
TG DEECET 2024 : తెలంగాణ డీఈఈసెట్ -2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నెల 6న డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల కాగా…8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఎలిమెంటరీ టీచర్ల కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్ నిర్వహిస్తారు. డీఎల్ఈడీ, డీపీఎస్‌ఈ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు రూ.500 ఫీజుగా చెల్లించి జూన్ 30 వరకు ఆన్‌లైన్ లో https://deecet.cdse.telangana.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సెప్టెంబరు 1 నాటికి 17 సంవత్సరాలు నిండిన వారు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు. డీఈఈసెట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
జులై 10న ప్రవేశ పరీక్ష
డీఈఈసెట్ ప్రవేశ పరీక్షను జులై 10న నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లను జులై 3 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. డీఈఈసెట్ ఫలితాలను జులై 16న విడుదల చేయనున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా జులై 19 నుంచి 27 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జులై 31న విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 1 నుంచి 4 వరకు ఫీజు చెల్లించి విద్యార్థులు సీటు కన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 6 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
ముఖ్యమైన తేదీలు
- జూన్ 6, 2024 – నోటిఫికేషన్ జారీ
- జూన్ 8 నుంచి జూన్ 30 వరకు – ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ
- జూన్ 29 నుంచి 30 వరకు – ఎడిట్ ఆప్షన్
- జులై 3 నుంచి – హాల్ టికెట్లు
- జులై 10న- TG DEECET-2024 ఆన్‌లైన్ పరీక్ష
- జులై 16- డీఈఈసెట్ ఫలితాలు
- జులై 19 నుంచి 23 వరకు – సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- జులై 24 నుంచి 27 వరకు – వెబ్ ఆప్షన్లు
- జులై 31 – సీట్లు కేటాయింపు
- ఆగస్టు 1 నుంచి 4 వరకు – ట్యూషన్ ఫీజు చెల్లింపు
- ఆగస్టు 6 – తరగతులు ప్రారంభం
డీఈఈసెట్ పరీక్ష విధానం
డీఈఈసెట్ ప్రవేశ పరీక్షను మూడు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్ధూ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.
- Part-1 : జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు
- Part-2 : జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు, జనరల్ తెలుగు/ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులు
- Part-3 : గణితం 20 ప్రశ్నలు 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు, బయోలజీ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులు
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్