Hyderabad Crime : అత్తాపూర్ లో దారుణం, బీరు సీసాతో గొంతు కోసి లారీ డ్రైవర్ హత్య!

Best Web Hosting Provider In India 2024


Hyderabad Crime : హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తిని తోటి స్నేహితులే దారుణంగా హత్య చేసి చంపేశారు. అత్తాపూర్ లోని సులేమాన్ నగర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ లాయీఫ్(30), అతని ముగ్గురు స్నేహితులు అత్తాపూర్ పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ 258 వద్దకు శనివారం రాత్రి మద్యం సేవించేందుకు వెళ్లారు. పీకల దాకా మద్యం తగిన లాయిఫ్, అతని స్నేహితులకు మద్యం మత్తులో ఏదో విషయంలో మాట మాట పెరిగింది. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు లారీ డ్రైవర్ లాయిఫ్ తలపై బీరు బాటిళ్లతో బాది, అనంతరం బీరు సీసాలతో గొంతుకోసి హత్య చేశారు. తరువాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

బేగంపేటలో హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

హైదరాబాద్ లోని బేగంపేట అల్లంతోట భావిలో ఓ వివాహేతర సంబంధం వ్యక్తి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..అల్లాంతోట భావి ప్రాంతానికి చెందిన అన్నామలై అయ్యప్ప (40)కు, పదేళ్ల క్రితం గాయత్రి అనే మహిళతో వివాహం జరిగింది. అయ్యప్ప సికింద్రాబాద్ పార్క్ లైన్ లోని ఓ ప్రింటర్ షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం 9:30 గంటలకు వెళ్లి రాత్రి 10.30 వస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఇంటికి బయలుదేరిన అయ్యప్ప మార్గమధ్యలోనే దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉండే ఆర్కే టవర్ సమీపంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో అయ్యప్ప రక్తపు మడుగులో మరణించి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు.

మద్యం పార్టీకి పిలిచి

ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అయ్యప్పను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. కాగా ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే కొమ్మల సాయి కన్యకు హౌస్ కీపింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని గత కొన్ని రోజులుగా అయ్యప్ప సదరు మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఆ చనువు కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సాయి కన్య భర్త కొమ్మల సంతోష్….ఎలాగైనా అయ్యప్పను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పక్క పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి, తనను కూడా మద్యం సేవించాలని ఆర్కే టవర్స్ వద్దకు పిలిపించి…..గ్రానైట్ రాతితో అయ్యప్ప తలపై బాది చంపేశారు. కాగా అయ్యప్ప భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Telangana NewsTrending TelanganaHyderabadCrime TelanganaMurder Case

Source / Credits

Best Web Hosting Provider In India 2024