AP Schools : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ల సెలవులు పొడిగించే ఛాన్స్!

Best Web Hosting Provider In India 2024


AP Schools : రాష్ట్రంలో విద్యార్థులకు గుడ్ న్యూస్ రానుంది.‌ స్కూల్ వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై విద్యాశాఖ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్రతి ఏడాది జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి.‌ జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి. కొన్ని‌ సందర్భాల్లో వేసవి వేడి తగ్గకపోతే వేసవి సెలవులు పెంచుతారు. అయితే ఇప్పుడూ స్కూళ్ల సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఏపీలో జూన్ 11 వరకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు జూన్ 12న పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్కూళ్లల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇటీవల ఏపీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా త్వరలోనే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే రోజున, వేసవి సెలవుల తరువాత రాష్ట్రంలోని పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దీంతో పాఠశాలలను ఈనెల 12కు బదులుగా, 13న తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పున:ప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కోరారు.

ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో స్కూళ్ల రీఓపెన్ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీలో స్కూల్స్ పున:ప్రారంభం అయ్యే తేదీ మారే అవకాశం ఉంది.‌ అయితే రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యా‌ శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి.

జూన్ 13న స్కూళ్ల రీఓపెన్!

చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒకరోజు తరువాత అంటే, జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని వర్షాల తీవ్రత బట్టి స్కూళ్లు పున:ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉంటే, ఆయా జిల్లాల కలెక్టర్లు స్కూల్‌కు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత కూడా తగ్గలేదు.‌ రాష్ట్రంలో వడగాడ్పులు ఎక్కువగా ఉన్నాయి.‌

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

SchoolsChandrababu NaiduEducationTelugu NewsAndhra Pradesh NewsTrending Ap

Source / Credits

Best Web Hosting Provider In India 2024