Best Web Hosting Provider In India 2024
Modi Cabinet : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం దిల్లీలో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారానికి ముందు ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర కేబినెట్ లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని వెల్లడించారు. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్రమంత్రి పదవి దక్కిందన్నారు. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యమన్నారు. ఎన్డీఏ పార్టీల మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయన్నారు. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రిజర్వేషన్ల అంశంలో తమ ఆలోచనలో మార్పు లేదని స్పష్టం చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్