Best Web Hosting Provider In India 2024
The Family Star TV Premiere: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. పరశురామ్ దర్శకత్వం వహించిన వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ బోల్తా కొట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. పూర్తిగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఓటీటీలో ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్ సినిమా టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు వస్తోంది. టీవీ ప్రీమియర్ వివరాలు వెల్లడయ్యాయి.
టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే
ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఈ ఆదివారం జూన్ 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్టార్ మా టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ ఈ వివరాలను ఆ ఛానెల్ వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
ఓటీటీలో దుమ్మురేపింది!
థియేటర్లలో నిరాశపరిచిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలో ఈ చిత్రానికి భారీ వ్యూస్ దక్కాయి. దీంతో రెండు వారాలు నేషనల్ వైడ్‍లో ఫ్యామిలీ స్టార్.. ప్రైమ్ వీడియోలో టాప్‍లో ట్రెండ్ అయింది. ఓటీటీలో అదరగొట్టింది ఈ మూవీ. మరి జూన్ 16న స్టార్ మాలో ప్రసారం కానుండగా.. ఎంత టీఆర్పీ తెచ్చుకుంటుందో చూడాలి.
ది ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ అవడంతో పాటు ఈ చిత్రంలోని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‍కు గురయ్యాయి. ముఖ్యంగా దోశ సీన్‍పై మీమ్స్ వెల్లువెత్తాయి. కొన్ని డైలాగ్‍లపై కూడా నెగెటివ్ అభిప్రాయాలు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు తీవ్రమైన మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్నస్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
ది ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్, మృణాల్‍తో పాటు జగపతి బాబు, వాసుకీ, అభిరామి, వెన్నెల కిశోల్ కీలకపాత్ర పోషించారు. గతంలో విజయ్ – డైరెక్టర్ పరశురామ్ కాంబోలో గీతగోవిందం బ్లాక్‍బస్టర్ కాగా ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవలేదు. ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది.
శ్రీవెంకటేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై ది ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్‍రాజు నిర్మించారు. సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందిందని అంచనా. అయితే, సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను మాత్రం సాధించింది. ఈ మూవీకి గోపీసుందర్ సంగీతం అందించారు.
స్టోరీ లైన్ ఇదే
కుటుంబమే సర్వస్వంగా భావించే యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) చుట్టూ ది ఫ్యామిలీ స్టార్ స్టోరీ తిరుగుతుంది. సివిల్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ తన అన్న కుటుంబం బాగోగులను చూసుకుంటూ ఉంటాడు విజయ్. ఈ క్రమంలో వారి ఇంట్లోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అద్దెకు వస్తారు. ఆ తర్వాత గోవర్దన్, ఇందు ప్రేమలో పడతారు. అయితే, ఇందు గురించి కొన్ని అనూహ్యమైన విషయాలను గోవర్ధన్ తెలుసుకుంటాడు. అసలు ఇందు ఎవరు.. గోవర్ధన్‍ను ఎందుకు కలిసింది.. అతడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాలు ది ఫ్యామిలీ స్టార్ చిత్రంలో ప్రధానంగా ఉన్నాయి.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits