TG Group 4 Merit List: తెలంగాణ గ్రూప్‌ 4 మెరిట్ జాబితా విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

Best Web Hosting Provider In India 2024


TG Group 4 Merit List: తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 4 మెరిట్‌ లిస్ట్ ఎట్టకేలకు విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో 8180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ చేపట్టనున్నారు.

మెరిట్‌ లిస్ట్‌‌లో చోటు దక్కించుకున్న అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. 8130 పోస్టులకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు పోటీ పడనున్నారు.

అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో ధృవీకరణ పత్రాల పరిశీలనకు హైదరాబాద్‌లొ రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యా లయంతో పాటు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యాల్లో సర్టిఫికెట్‌ పరిశీలన కొనసాగుతుందని కమిషన్ వెల్ల డించింది.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ రోజువారీ షెడ్యూలును త్వరలో టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌ సైట్‌ నుంచి కావాల్సిన ధృవీకరణ పత్రాల చెక్‌లిస్ట్‌, అటెస్టేషన్ ఫాంలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యే నాటికి సంబంధిత పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ఖాళీల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసేందుకు ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌ లింకు అందుబాటులోకి వస్తుంది. వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసిన వారికి మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అనుమతించనున్నారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్‌4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. https://www.tspsc.gov.in/ లో గ్రూప్‌ 4 ఉద్యోగాల భర్తీ అప్డేట్స్ విడుదల చేసింది.

గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భ‌ర్తీ చేయనున్నారు. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ఇప్పటికే ప్రకటించింది .

జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించగా…. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది.తుది ఎంపికల కోసం 1:3 ఎంపిక చేశారు. వెరిఫికేష‌న్ తేదీలను వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు లోక్‌సభ పోలింగ్ ముగిసిన వెంటనే కమిషన్ ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్ తో పాటు స్టడీ సర్టిఫికేట్స్ తో పాటు విద్యా అర్హత పత్రాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని కమిషన్ సూచించింది. వెబ్ సైట్ లో కమిషన్ సూచించిన పత్రాలను మిస్ కాకుండా చూసుకోవాలని…. ఏ ఒక్కటి లేకపోయినా ఆయా అభ్యర్థులను పక్కనపెడతారని తెలిపింది. చెక్‌లిస్ట్‌ ప్రకారం కావాల్సిన పత్రాలను వెబ్‌ ఆప్షన్ విండో ఓపెన్‌ అయ్యేలోపు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌ 4 చెక్‌ లిస్ట్‌ కోసం కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://www.tspsc.gov.in/ గత ఏడాది జులైలో గ్రూప్ 4 పరీక్షల్ని నిర్వహించారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

Ts Group 4TspscJobsGovernment JobsTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024