Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu Serial: రిషి కనిపించడం లేదని వసుధార పేపర్‌లో ఇచ్చిన ప్రకటనను తప్పుపడతాడు మినిస్టర్. రిషి చనిపోయాడన్నది నిజమని మినిస్టర్‌తో పాటు ఫణీంద్ర, శైలేంద్ర కూడా ఉంటారు. కానీ వసుధార మాత్రం వారి మాటలను వ్యతిరేకిస్తుంది. రిషి బతికే ఉన్నాడని వాదిస్తుంది. ఏవో రెండు ఆధారాలు చూపించి రిషి చనిపోయాడంటే తాను ఒప్పుకోనని చెప్పి మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోతుంది. మినిస్టర్‌తో పాటు ఫణీంద్ర పిలుస్తున్నా పట్టించుకోదు.
డీబీఎస్‌టీ కాలేజీ పతనం…
వసుధార తీరును మినిస్టర్ తప్పుపడతాడు. ఎండీకి సహనం, ఓపిక ఉండాలని అంటాడు. ఇప్పటికే కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయం తెలిసి మిషన్ ఎడ్యుకేషన్ తమకు ఇవ్వమని కొన్ని కాలేజీలు ప్రపోజల్స్ పెట్టాయని, అదే జరిగితే డీబీఎస్‌టీ కాలేజీ పూర్తిగా పతనం అయినట్లేనని మినిస్టర్ ఫైర్ అవుతాడు.
మనుపై ఫైర్….
మనుపై కోప్పడుతుంది వసుధార. మీరు నాకు బలం అవుతారనుకుంటే ఇలా కఠిన పరిస్థితుల్లో మౌనంగా, ఏం పట్టనట్లుగా ఉంటారని అనుకోలేదని నిందిస్తుంది. తండ్రిని వెతకడంలో సాయం చేయలేదని నాపై ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని మనును నిలదీస్తుంది వసుధార. మన కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ రాకుండా ఎవరు అడ్డుకున్నారోనని ఆలోచిస్తున్నానని వసుధారకు బదులిస్తాడు మను.
ఈ పని చేసింది శైలేంద్రనే అని వసుధార అంటుంది. ఎండీ సీట్ కోసం ఆలోచించి తనకు తెలియకుండానే కాలేజీకి ద్రోహం చేస్తున్నాడని వసుధార కోపంగా చెబుతుంది. భూషణ్ ఫ్యామిలీలో మెంబర్ కాబట్టే శైలేంద్రకు ఆ మాత్రమైనా గౌరవం ఉందని, లేదంటే అతడికి ఉన్న నాలెడ్జ్‌కు ఎవరూ సెక్యూరిటీ జాబ్ కూడా ఇవ్వరని వసుధారతో చెబుతాడు మను.
శైలేంద్ర గురించి ఆలోచించి…
నేను శైలేంద్ర గురించిఆలోచించే బోర్డ్ మీటింగ్‌లో సైలెంట్‌గా ఉన్నానని వసుధారతో అంటాడు మను. నేను ఏం మాట్లాడినా శైలేంద్ర దానిని అనుకూలంగా మార్చుకొని మనల్ని ఇంకా బ్లేమ్ చేస్తున్నాడని, వసుధారకు సమాధానమిస్తాడు మను. రిషి బతికి ఉన్నాడని మిగిలిన వారితో మీరు కూడా నమ్మకం లేదు కదా అని మనును అడుగుతుంది వసుధార. అలాంటిదేమి లేదని మను ఆన్సర్ ఇస్తాడు. కానీ అతడి మాటలను వసుధార నమ్మదు.
శైలేంద్ర భయం…
మను, వసుధార మాటలను చాటునుంచి శైలేంద్ర వింటాడు. లోపలికి ఎంట్రీ ఇచ్చి వారిని తన మాటలతో మరింత చిరాకు పెట్టాలని అనుకుంటాడు. కానీ మను, వసుధార ఇద్దరు కోపంగా ఉండటం చూసి వెనక్కి తగ్గుతాడు. తాను లోపలికి ఇద్దరు కలిసి తనను ఓ ఆట ఆడుకునే ప్రమాదం ఉందని అక్కడి నుంచి జారుకుంటాడు శైలేంద్ర.
ఫణీంద్ర కఠిన నిర్ణయం…
తన కళ్ల ముందే కాలేజీ పతనం అయిపోవడం ఫణీంద్ర సహించలేడు. కాలేజీ బాగు కోసం ఓ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని తమ్ముడు మహేంద్రతో అంటాడు. ఆ నిర్ణయం ఏమిటన్నది నువ్వు, వసుధార కలిసి సాయంత్రం మా ఇంటికి వస్తే చెబుతానని అంటాడు.
వసుధార ఎమోషనల్…
రిషి బతికే ఉన్నాడని తన మాటలను ఎవరూ నమ్మకపోవడం చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది. నేను నిన్ను నమ్ముతున్నానని, బయటివాళ్ల మాటలు పట్టించుకోవద్దని వసుధారను ఓదార్చుతాడు మహేంద్ర. రిషి లేడని మీ మనసులో అనుకుంటున్నారని నాకు అర్థమవుతుందని, కానీ నన్ను ఓదార్చడానికే రిషి ఉన్నట్లుగా నటిస్తున్నారు కదా అని మహేంద్రను అడుగుతుంది వసుధార. అది అబద్ధమని రిషి బతికి ఉన్నాడని నువ్వు బలంగా నమ్ముతున్న రోజు నుంచే నేను నా కొడుకు క్షేమంగా ఉన్నాడనే నేను ఫిక్సైయ్యానని వసుధారకు బదులిస్తాడు మహేంద్ర.
ధరణి అనుమానం….
కాలేజీలో ఎగ్జామినేషన్ సెంటర్ గురించి పదే పదే ఫోన్ కాల్స్ రావడం చూసి ఫణీంద్ర ప్రస్టేట్ అవుతాడు. ఫోస్ స్విఛాఫ్ చేస్తాడు. ఇదే అదనుగా వసుధారపై తమ మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడతారు శైలేంద్ర, దేవయాని. వసుధార వల్లే కాలేజీకి నష్టం జరిగిందని చెబుతారు. శైలేంద్రను చూస్తూ మన కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ పోవడం వెనుక ఎవరో ఉన్నారని ధరణి డౌట్ వ్యక్తం చేస్తుంది. ఆమె మాటలతో శైలేంద్ర కంగారు పడతాడు. తన కుట్రలు బయటపడకుండా ఉండాలంటే మౌనంగా ఉండటమే మంచిదని అనుకుంటాడు.
ఎండీ సీట్ వదిలేయాల్సిన పనిలేదు…
ఎండీ సీట్‌ను వదిలేయమని చెప్పడానికే ఫణీంద్ర తనను ఇంటికి పిలిచాడని వసుధార అనుకుంటుంది. అదే అనుమానంతో మహేంద్రతో కలిసి ఫణీంద్ర ఇంటికి వస్తుంది వసుధార. వసుధార, రిషి అంటే తనకు ఎంత ఇష్టామో చెబుతాడు ఫణీంద్ర. రిషి, జగతి దూరమవ్వడం, కాలేజీ పతనం అవుతుండటం తన మనసును బాధపెడుతున్నాయని అంటాడు.
తన వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని, ఎండీ సీట్‌ను వదిలిపెడతానని ఫణీంద్రతో అంటుంది వసుధార. కానీ ఎండీ సీట్ వదిలిపెట్టాల్సిన పని లేదని, ఆ పదవికి నువ్వే అర్హురాలివని వసుధారతో అంటాడు ఫణీంద్ర. అతడి మాటలతో శైలేంద్ర, దేవయాని షాకవుతారు.
రిషి ఇక రాడు…
రిషి లేడనే నిజాన్ని నువ్వు నమ్మాలని వసుధార అంటాడు ఫణీంద్ర. రిషి ఇక రాడని అంటాడు. రిషి చనిపోయాడనే నిజాన్ని అందరూ ఒప్పుకున్నారు. అది నువ్వు కూడా ఒప్పుకోవాలని వసుధారతో చెబుతాడు ఫణీంద్ర. నా ప్రాణం ఇవ్వమని అన్నా ఇస్తాను…కానీ రిషి లేడంటే తాను ఒప్పుకోలేనని వసుధార కన్నీళ్లతో ఫణీంద్రకు బదులిస్తుంది.
రిషిని తీసుకొస్తాననినువ్వు చెప్పిన గడువు పూర్తయ్యే టైమ్ దగ్గర పడిందని, నిజంగా రిషి వచ్చేవాడు అయితే ఎప్పుడో వచ్చేవాడని ఫణీంద్ర అంటాడు. గడువు పూర్తవ్వడానికి ఇంకా కొంచెం టైమ్ మిగిలుందని ఫణీంద్రకు సర్ధిచెబుతుంది వసుధార. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits