APFU Admissions: ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల

Best Web Hosting Provider In India 2024


APFU Admissions: ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయం ద్వారా పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 10నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్ధిని, విద్యార్ధుల నుుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు https://apfu.ap.gov.in/index లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఏపీ మత్స్య యూనివర్విటీ ద్వారా ఫిషరీ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, P.HD డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. రాష్ట్రంలోని పారా ఫిషరీ సిబ్బంది అవసరాలను తీర్చడానికి 10వ తరగతి పూర్తి చేసిన గ్రామీణ యువత కోసం యూనివర్సిటీ ఫిషరీ సైన్స్‌లో రెండేళ్ల డిప్లొమా ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.

రాష్ట్రంలో మొదటి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లా అవనిగడ్డ సమీపంలోని భావదేవరపల్లిలో 2007లో ఏర్పాటు చేశారు. . రాష్ట్రంలో, ప్రత్యేకించి దివిసీమ ప్రాంతానికి ‘దివిసీమ గాంధీ’గా పేరుగాంచిన మండలి వెంకట కృష్ణారావు పేరిట పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేశారు.

26 ఫిబ్రవరి 2009న మంత్ర మండలి బుద్ద ప్రసాద్ పాలిటెక్నిక్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 2013 జూన్ 15న సిఎం కిరణ్ కుమార్‌ రెడ్డి కాలేజీ భవనాలను ప్రారంభించారు.

ఆక్వాకల్చర్ పరిశ్రమకు మద్దతుగా క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కళాశాలను ఏర్పాటు చేశారు. దేశంలో స్థిరమైన ఆక్వాకల్చర్ కోసం చిన్న మరియు సన్నకారు రైతులకు సాంకేతిక సహాయాన్ని అందించే లక్ష్యంతో కోర్సుల్ని నిర్వహిస్తున్నారు. ఫిషరీస్ పాలిటెక్నిక్‌లో మొత్తం 50సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అడ్మిషన్ విధానం

1.APFU నుండి ఒక పేపర్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం జూన్ నెలలో జారీ చేస్తారు.

2.SSC (10th) ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. రిజర్వేషన్లను అనుసరించి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

3.OC మరియు BC విద్యార్థుల విషయంలో హిందీ లేకుండా కనీసం 55% మార్కులు ఉత్తీర్ణత పొందాలి.

4. SC మరియు ST విద్యార్థుల విషయంలో హిందీ లేకుండా కనీసం 45% మార్కులు అవసరం.

5. ఫిషరీస్ పాలిటెక్నిక్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థి SSC వరకు కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి.

6.ఇంటర్ పాసైన విద్యార్థులు డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

అకాడెమిక్ ప్రోగ్రామ్

1.ఈ కోర్సును 4 సెమిస్టర్‌లతో కూడిన ప్రోగ్రామ్, ఇందులో 3 సెమిస్టర్‌ల సైద్ధాంతిక పరిజ్ఞానం మరియు 1 సెమిస్టర్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇందులో క్షేత్ర స్థాయిలో ఫిషరీస్ పాలిటెక్నిక్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్ (FPWEP) పూర్తి చేయాల్సి ఉంటుంది. .

విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించడానికి మంచి సంఖ్యలో నమూనాలతో పాటు మంచి ప్రయోగశాల అభివృద్ధి చేయబడింది. విద్యార్థులకు ఇంటర్నెట్‌తో పాటు కంప్యూటర్ సౌకర్యం కల్పించారు.

ఆక్వా ఫార్మింగ్ మరియు ఇండస్ట్రీ వాటాదారులతో క్యాంపస్ ఇంటర్వ్యూలను క్రమం తప్పకుండా నిర్వహించి ఏటా 100% ప్లేస్‌మెంట్‌లను సాధిస్తోంది. ఫిషరీస్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

SC, ST, BC మరియు మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. విద్యార్థులందరికీ వైద్య బీమా వర్తిస్తుంది.

హాస్టల్ సౌకర్యాలు

బాలురు మరియు బాలికల కోసం ప్రత్యేక హాస్టళ్లు రెండు ప్రైవేట్ భవనంలో సాధారణ మెస్‌తో నడుస్తున్నాయి. బాలుర హాస్టల్ మరియు బాలికల హాస్టల్ రెండింటికీ ల్యాండ్ లైన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిషరీస్ యూనివర్శిటీ వెబ్‌సైట్‌ https://apfu.ap.gov.in/index సందర్శించండి.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

EducationAdmissionsNotificationAp UniversitiesAndhra Pradesh NewsCoastal Andhra PradeshGovernment Of Andhra Pradesh

Source / Credits

Best Web Hosting Provider In India 2024