After Bath Mistakes : స్నానం చేసిన వెంటనే అందరూ చేసే తప్పులు.. మీరు మాత్రం అస్సలు చేయకండి

Best Web Hosting Provider In India 2024

స్నానం చేసిన వెంటనే ఒక్కోక్కరు ఒక్కో పని చేస్తాం. కానీ మనం చేసే కొన్ని పనులు మన శరీరాన్ని లేదా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాల పనులు చేయడం వలన మీరు అనారోగ్యం పాలవుతారు. స్నానం చేసిన వెంటనే చేయకూడని పనుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. తినడం నుండి తాగడం వరకు అన్ని ముఖ్యమే. స్నానం చేయడం, కూర్చోవడం, నడవడం.. ఇలా ప్రతిదీ ఆరోగ్యంపై భాగమే. శారీరక వ్యాయామంపై కూడా శ్రద్ధ వహించాలి. దీనితో పాటు రోజూ స్నానం చేయడం కూడా శరీరానికి చాలా అవసరం. స్నానం చేయడం మంచిది, కానీ స్నానం చేసిన వెంటనే కొన్ని పనులు పనులు మాత్రం చేయకూడదు. వాటి వలన మీ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది.

ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని, అదేవిధంగా స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేయకూడదని అంటుంటారు. ఎందుకంటే దీని వలన మీ శరీరంపై ప్రభావం పడుతుంది. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్నానం చేసిన తర్వాత ఏం చేయకూడదో తెలుసుకుందాం.

నీరు తాగవద్దు

స్నానం చేసిన వెంటనే నీరు తాగవద్దు. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయని గమనించాలి.

రక్తపోటు అసమతుల్యమవుతుంది

మీరు స్నానం చేసిన వెంటనే నీరు తాగితే అది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా రక్తపోటు కూడా అసమతుల్యతగా మారే అవకాశం ఉంది. రక్తపోటులో మార్పులు వస్తాయి.

హెయిర్ డ్రైయర్

స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్ ఉపయోగించి మీ జుట్టును ఆరబెట్టవద్దు. దీని కారణంగా జుట్టు మృదుత్వం అదృశ్యమవుతుంది. జుట్టు మరింత పొడిగా మారుతుంది. రాలిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

చర్మాన్ని బలంగా రుద్దకండి

స్నానం చేసిన వెంటనే టవల్ తీసుకుని చర్మాన్ని బలంగా రుద్దడం కొందరికి అలవాటు. ఒంటిపై ఉన్న నీరు అంతా పోవాలని గట్టిగా రుద్దుతుంటారు. కానీ ఇలా చేయకూడదు. దీని వల్ల చర్మం డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఇది చర్మాన్ని పొడిగా చేస్తుంది. సున్నితమైన టవల్‌తో రుద్దండి. టవల్ తో చర్మాన్ని గట్టిగా రుద్దడం వల్ల చర్మంపై ఉన్న నీటి కణాలు లాగడానికి అవకాశం ఉంది. దీంతో చర్మం పొడిబారుతుంది, దీని వల్ల చర్మం దురద వచ్చే అవకాశం ఉంది

ఎండలో వెళ్లవద్దు

స్నానం చేసిన వెంటనే ఎండలోకి వెళ్లవద్దు. దీని వల్ల ఒక్కోసారి ఎండలు మీపై పడటం, శరీరం వేడెక్కడం, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్నానం చేసిన వెంటనే ఈ పనులు చేయకుండా ఉండండి. స్నానం చేసిన తర్వాత కచ్చితంగా పైన చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మీ చర్మంతోపాటుగా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024