Best Web Hosting Provider In India 2024
Bigg Boss OTT 3 Promo: బిగ్ బాస్ ఓటీటీ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా ఇప్పుడు మూడో సీజన్ తో రాబోతోంది. ఈ సరికొత్త సీజన్ జూన్ 21 రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను సోమవారం (జూన్ 10) రిలీజ్ చేశారు. అయితే ఈ సీజన్లో అతిపెద్ద మార్పు సల్మాన్ ఖాన్ స్థానంలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ రావడమే.
బిగ్ బాస్ ఓటీటీ 3 ప్రోమో.. అన్నీ మారిపోతాయ్
అన్నీ మారిపోతాయ్ అంటూ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రోమోలో అనిల్ కపూర్ చెప్పడం విశేషం. జియో సినిమాలో ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇన్నాళ్లూ తన సినిమాల ద్వారానే అలరించిన అనిల్ కపూర్ ను ఈ సరికొత్త అవతారంలో చూడటానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రోమోను కూడా ఆసక్తికరంగా తీసుకొచ్చారు.
“ఇదే మిగిలి ఉందా ఏకే అంటూ అందరూ అడిగారు. నేనడిగాను ఏం ఏం మిగిలి ఉన్నాయి ఏకే అని. మంచి చెడు.. నీళ్లు నిప్పు.. తిట్లు చప్పట్లు.. అన్నీ చూశాను అన్నీ విన్నాను.. ఇప్పుడు నా వంతు.. రూల్ కొత్తది.. గేమ్ అదే.. కొంచెం లాజిక్.. కొంచెం మ్యాజిక్” అంటూ అనిల్ కపూర్ ఇచ్చిన ఎంట్రీ చాలా భిన్నంగా ఉంది. ఈసారి ఏకే హోస్ట్ చేసే ఈ షో కచ్చితంగా భిన్నంగా ఉండబోతోందన్నది ప్రోమోతోనే స్పష్టమవుతోంది.
ఒక నిమిషం 15 సెకన్ల నిడివితో ఈ కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. 67 ఏళ్ల వయసులో అనిల్ కపూర్ బిగ్ బాస్ లాంటి గేమ్ షోను హోస్ట్ చేయనుండటం కచ్చితంగా విశేషమే. ఎక్కువగా మిలీనియల్స్, జనరేషన్ జెడ్ ఫాలో అయ్యే ఈ షోని ఏకే ఎలా హోస్ట్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అటు టీవీతోపాటు ఇటు ఓటీటీలోనూ తన చరిష్మాతో ఇన్నాళ్లూ సల్మాన్ ఖాన్ విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపించాడు.
బిగ్ బాస్ ఓటీటీ ఏంటి?
బిగ్ బాస్ షో చాలా ఏళ్ల కిందటే ఇండియాలో మొదలైంది. హిందీలో అయితే టీవీ రియాల్టీ షో 17 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే రెండేళ్ల కిందట బిగ్ బాస్ ఓటీటీ అంటూ సరికొత్తగా ఈ రియాల్టీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టీవీల చరిష్మా తగ్గి ఓటీటీల యుగం నడుస్తున్న వేళ బిగ్ బాస్ ను కూడా సరికొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. నిజానికి బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ ను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశాడు. రెండో సీజన్ కు సల్మాన్ ఖాన్ తిరిగి వచ్చాడు. ఇప్పుడు మూడో సీజన్ నుంచి అతడు తప్పుకోగా.. అనిల్ కపూర్ కు అవకాశం దక్కింది. తొలి సీజన్ లో దివ్య అగర్వాల్ విజేతగా నిలవగా.. రెండో సీజన్ లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ గెలిచాడు.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits