Best Web Hosting Provider In India 2024
Satyabhama Box Office: టాలీవుడ్ చందమామ కాజల్ నటించిన సత్యభామ మూవీ గత శుక్రవారం (జూన్ 7) రిలీజైన విషయం తెలిసిందే. ఈ పోలీస్ డ్రామాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఆ ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపైనా పడినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు చాలా రోజులుగా బాగానే ప్రమోషన్లు నిర్వహించినా.. ఫస్ట్ వీకెండ్ మాత్రం ఆశించిన మేర రాలేదనే చెప్పాలి.
సత్యభామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు
కాజల్ నటించిన సత్యభామ మూవీ ఫస్ట్ వీకెండ్ ఇండియాలో రూ.1.3 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు sacnilk.com వెల్లడించింది. తొలి రోజు రూ.0.4 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ మూవీ.. తర్వాతి రెండు రోజుల్లోనూ పెద్దగా రాబట్టలేకపోయింది. శనివారం రూ.0.46 కోట్లు, ఆదివారం రూ.0.49 కోట్లు వసూలు చేసింది. దీంతో తొలి మూడు రోజులు కలిపి రూ.1.3 కోట్లు మాత్రమే వచ్చాయి.
నిజానికి సత్యభామ మూవీని కాజల్ తోపాటు టీమ్ అంతా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. బాలకృష్ణ కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చాడు. తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ నటించింది. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సుమన్ చిక్కల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆక్యుపెన్సీ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
వీకెండ్ లోనే మూవీకి ఆశించిన మేర కలెక్షన్లు రాలేదు. ఇక సోమవారం (జూన్ 10) నుంచి ఈ కలెక్షన్లు మరింత పడిపోనున్నాయి. కాజల్ తోపాటు ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా నటించాడు.
సత్యభామ ఎలా ఉందంటే?
సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీమ్‌లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. హసీనా అనే యువతిని ఆమె భర్త యాదు దారుణంగా హత్యచేస్తాడు. ఆ మర్డర్ తర్వాత హసీనా భర్త యాదుతో పాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్ యాద్మ) కనిపించకుండాపోతారు.
హసీనాను చంపిన యాదును పట్టుకోవడంతో పాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో సత్యభామకు ఎలాంటి నిజాలు తెలిశాయి? ఈ మర్డర్ కేసులోకి ఎంపీ కొడుకు రిషితో పాటు విజయ్, నేహా ఎలా వచ్చారు? అసలు హసీనా ఎలా చనిపోయింది? ఆమె మరణం వెనుకున్న మిస్టరీని సత్యభామ ఏ విధంగా ఛేదించింది అన్నదే ఈ మూవీ కథ.
ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్‌లో కాజల్ అగర్వాల్ యాక్టింగ్ బాగుంటూ తెలుగు ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తోన్నారు. సత్యభామ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్, కథలోని ట్విస్ట్, ఎమోషన్స్ బాగున్నాయంటూ ప్రశంసలు లభిస్తోన్నాయి. అయితే లెక్కకుమించిన క్యారెక్టర్స్ ఉండటం, కథలో అనేక అంశాలకు చోటు ఇచ్చిన దర్శకుడు వాటిని క్లారిటీగా స్క్రీన్‌పై చెప్పడంలో కన్ఫ్యూజ్ అయినట్లు నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits