Best Web Hosting Provider In India 2024
This Week OTT Movies: మళ్లీ కొత్త వారం రానే వచ్చేసింది. ఇటు ఓటీటీల్లో అటు థియేటర్లలో సినిమాల సందడి నెలకొననుంది. ఇటీవల థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సత్యభామ, లవ్ మౌళి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఈ వారం యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, హరోం హర వంటి చిన్న సినిమాలు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే, థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సందడి గట్టిగా ఉండనుంది. ఈ వారం జూన్ 10 నుంచి 16 వరకు సినిమాలు వెబ్ సిరీసులు కలిపి మొత్తం 23 ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో తెలుగు హారర్ ఫాంటసీ వెబ్ సిరీసుతోపాటు ఇటీవల విడుదలైన కొత్త సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ సినిమాలు, వెబ్ సిరీసులు ఏ ఓటీటీలో రిలీజ్ కానున్నాయంటే..
నెట్ఫ్లిక్స్ ఓటీటీ
టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- జూన్ 11
కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ది గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12
మై నెక్ట్స్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12
మిస్టరీస్ ఆఫ్ ది టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 12
డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ వెబ్ సిరీస్)- జూన్ 13
బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 13
అబంగ్ అధిక్ (మాండరిన్ మూవీ)- జూన్ 14
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు సినిమా)- జూన్ 14
జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేషియన్ వెబ్ సిరీస్)- జూన్ 14
మహారాజ్ (హిందీ చిత్రం)- జూన్ 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
గ్రౌండ్ (తెలుగు మూవీ)- జూన్ 10
ది బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 13
ఆహా ఓటీటీ
పారిజాత పర్వం (తెలుగు మూవీ)- జూన్ 12
కురంగు పెడల్ (తమిళ వెబ్ సిరీస్)- జూన్ 14
డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ
ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 10
ది కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 10
నాట్ డెడ్ ఎట్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12
యక్షిణి (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14
జీ5 ఓటీటీ
లవ్ కీ అరెంజ్ మ్యారేజ్ (హిందీ చిత్రం)- జూన్ 14
పరువు (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14
ఆపిల్ ప్లస్ టీవీ
ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12
క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 14
ఘాంత్ చాప్టర్ 1 (హిందీ వెబ్ సిరీస్)- జూన్ 11
ఇలా ఈ వారం ఓటీటీలోకి 23 సినిమాలు, వెబ్ సిరీసులు రానున్నాయి. వాటిలో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ పారిజాత పర్వం, గ్రౌండ్ మూవీతోపాటు తెలుగు హారర్ ఫాంటసీ వెబ్ సిరీసు యక్షిణి, పరువు, ది బాయ్స్ సీజన్ 4 స్పెషల్ కానున్నాయి. అంటే మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీసులతో 6 స్పెషల్ కానున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits