Best Web Hosting Provider In India 2024
IRCTC Singapore Malaysia Tour : ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని మరుపురాని వేడుకగా చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే ముంబయి నుంచి సింగపూర్, మలేషియాకు 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. పర్యాటకులను మంత్రి ముగ్ధులను చేసే ఆకర్షణలను ఆరు రోజుల్లో చూసిరావచ్చు. రూ.1,15,900 ప్రారంభం ధరతో ఆగస్టు 13 నుంచి 19 మధ్యలో ఈ టూర్ కొనసాగనుంది.
ఈ ప్యాకేజీ మరిన్ని వివరాల కోసం 8287931655కు “SM” అని SMS చేయండి. “మెస్మరైజింగ్ సింగపూర్, మలేషియా” ప్యాకేజీలో తక్కువ ఖర్చుతో ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలను కవర్ చేయవచ్చు.
విమాన వివరాలు
ఫ్లైట్- తేదీ- సెక్టార్- డిపార్చర్ – రాక
- OD 216 – 13.08.2024 – BOM – KUL – 23:15 గం -07:10 గంటలు +1
- OD 803- 14.08.2024 -కుల్- సిన్- 10:30 గం- 11:30 గం
- OD 808 -17.08.2024 -సిన్-కుల్- 17.00 గం -18.05 గం
- OD 215 -19.08.2024- KUL – BOM -19:25 గం- 22:20 గం
ప్యాకేజీ ధర (ఒక్కో వ్యక్తికి)
- అడల్ట్ సింగిల్ ఆక్యుపెన్సీ- రూ. 137500/-
- అడల్ట్ డబుల్ ఆక్యుపెన్సీ -రూ. 115900/-
- అడల్డ్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ- రూ. 115900/-
- చైల్డ్ విత్ బెడ్ (2-11 సంవత్సరాలు)- రూ. 101900/-
- చైల్డ్ వితవుట్ బెడ్ (2-11 సంవత్సరాలు)- రూ. 87900/-
1వ రోజు : ముంబయి
ముంబయి నుంచి కౌలాలంపూర్‌కు విమానంలో బయలుదేరతారు.
2వ రోజు : కౌలాలంపూర్-సింగపూర్
కౌలాలంపూర్ చేరుకుని, సింగపూర్ వెళ్లేందుకు మరో విమానం ఎక్కుతారు. సింగపూర్‌కు చేరుకున్న తర్వాత, స్థానిక టూర్ గైడ్‌ని కలుసుకుంటారు. హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. హోటల్ లో భోజనం చేస్తారు. సాయంత్రం ట్రామ్ రైడ్, జంతు ప్రదర్శనలతో నైట్ సఫారీని సందర్శి్స్తారు. రాత్రికి సింగపూర్‌లో బసచేస్తారు.
3 రోజు : సింగపూర్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత సిటీ టూర్‌లో సింగపూర్, సివిక్ డిస్ట్రిక్ట్ చూస్తారు. పడాంగ్, క్రికెట్ క్లబ్, హిస్టారిక్ పార్లమెంట్ హౌస్, సుప్రీం కోర్టు, సిటీ హాల్, తర్వాత మెర్లియన్ పార్క్, థియాన్ హాక్ కెంగ్ టెంపుల్, సింగపూర్ ఫ్లైయర్ వీక్షిస్తారు. భోజనం తర్వాత వన్ వే కేబుల్ కార్ రైడ్, మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్, సింగపూర్ సీ అక్వేరియంతో సెంటోసా ఐలాండ్ టూర్‌ను సందర్శిస్తారు. తర్వాత హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి సింగపూర్ లోనే బస చేస్తారు.
4 రోజు : సింగపూర్
బ్రేక్ ఫాస్ట్ తర్వాత, మీరు స్థానిక ప్రదేశాలను అన్వేషించవచ్చు. ఒకరోజు విశ్రాంతి ఉంటుంది. సింగపూర్‌లోని హోటల్‌లో రాత్రి బస చేస్తారు.
5 రోజు : సింగపూర్ – కౌలాలంపూర్
హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత చెక్అవుట్ చేస్తారు. బే ద్వారా గార్డెన్స్ సందర్శిస్తారు. కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు సింగపూర్ విమానాశ్రయంలో సాయంత్రం డ్రాప్ చేస్తారు. కౌలాలంపూర్ చేరుకున్నాక హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. కౌలాలంపూర్‌లో రాత్రి బస చేస్తారు.
6వ రోజు : కౌలాలంపూర్
బ్రేక్ ఫాస్ట్ తర్వాత జెంటింగ్ హైలాండ్స్‌కు వెళ్తారు. దాని తర్వాత బటు గుహలు (లార్డ్ మురుగ ఆలయం) సందర్శన, తర్వాత వన్ వే కేబుల్ కార్ జెంటింగ్‌ను సందర్శించవచ్చు. కౌలాలంపూర్‌లో రాత్రి బస చేస్తారు.
7వ రోజు : కౌలాలంపూర్
బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కౌలాలంపూర్ నగర పర్యటనకు వెళ్లారు. కింగ్స్ ప్యాలెస్, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇండిపెండెన్స్ స్క్వేర్, పార్లమెంట్ హౌస్, నేషనల్ మాన్యుమెంట్, జామెక్స్ మసీదు, పెట్రోనాస్ ట్విన్ టవర్ (స్కై బ్రిడ్జ్ ఎంట్రీ) సందర్శిస్తారు. లంచ్ తర్వాత పుత్రజయను సందర్శించి, సాయంత్రం 7.25 గంటలకు తిరుగు ప్రయాణానికి విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ సింగపూర్, మలేషియా టూర్ ప్యాకేజీ బుకింగ్, పుర్తి వివరాలు ఈ కింద లింక్ లో తెలుసుకోవచ్చు.
https://www.irctctourism.com/pacakage_description?packageCode=WMO040
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్