Best Web Hosting Provider In India 2024
AP EAPCET Results 2024 : ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్(AP EAPCET) పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలు ఉన్నత విద్యామండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఫలితాలు, స్కోర్ కార్డును విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ విభాగంలో
ఫస్ట్ ర్యాంక్- మాకినేని జిష్ణు సాయి(గుంటూరు), సెకండ్ ర్యాంకు – సాయి హశ్వంత్ రెడ్డి(కర్నూలు), థర్డ్ ర్యాంకు-భోగళ్లపల్లి సందేష్(ఆదోని)
ఫార్మసీ విభాగంలో
ఫస్ట్ ర్యాంగ్ – శ్రీశాంత్ రెడ్డి(హైదరాబాద్), సెకండ్ ర్యాంక్- పూల దివ్య తేజ(సత్యసాయి జిల్లా), థర్డ్ ర్యాంక్- వడ్లపూడి ముఖేష్ చౌదరి(తిరుపతి)
ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 93.47 శాతం మంది పరీక్షలు రాశారు. ఇప్పటికే ఈఏపీసెట్ ప్రవేశపరీక్ష ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. వీటిపై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్