Best Web Hosting Provider In India 2024
AP Cabinet : రాష్ట్రంలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. బుధవారం ఉదయం 11:27 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే మంత్రి వర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే టీడీపీ కూటమి భాగస్వామ్య పార్టీలకు మంత్రి పదవుల పంపకం కూడా చివరి దశకు చేరుకుంది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందులో టీడీపీ నుంచి 19 మంది, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2 సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కూటమి పార్టీలకు మంత్రి పదవులు సర్దుబాటు చేయడంతో ఆరు మంత్రి పదవులు టీడీపీకి తగ్గుతున్నాయి. దీంతో టీడీపీలో కొంత మందికి మంత్రి పదవులు దూరం అయ్యే అవకాశం ఉంది. సామాజిక కూర్పుతో కూడా కొంత మంది సీనియర్ మంత్రులకు కూడా పదవులు దక్కే అవకాశం లేదు.
టీడీపీ నుంచి ఆశావహులు
టీడీపీ నుంచి మంత్రి పదవులు శ్రీకాకుళం నుంచి కూన రవికుమార్(బీసీ), కె. అచ్చెంనాయుడు (బీసీ), కొండ్రు మురళీమోహన్ (ఎస్సీ), విజయనగరం నుంచి గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ), అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు (క్షత్రియ), బేబీ నాయన (వెలమ రాజు), కళా వెంకటరావు (బీసీ), కోళ్ల లలిత కుమారి (బీసీ), విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు (కాపు), చింతకాయల అయ్యన్నపాత్రుడు (బీసీ), పల్లా శ్రీనివాసరావు (బీసీ), వంగలపూడి అనిత (ఎస్సీ), తూర్పుగోదావరి నుంచి యనమల రామకృష్ణుడు (బీసీ యాదవ), జ్యోతుల నెహ్రూ (కాపు), నిమ్మకాయల చిన రాజప్ప (కాపు), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (కమ్మ), పశ్చిమగోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు (కమ్మ), రఘురామ కృష్ణరాజు (క్షత్రియ), కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకారు), కొలుసు పార్థసారథి (బీసీ యాదవ), బొండా ఉమామహేశ్వరరావు (కాపు), శ్రీరాం తాతయ్య (ఓసీ ఆర్యవైశ్య), తంగిరాల సౌమ్య (ఎస్సీ) రేసులో ఉన్నారు.
గుంటూరు జిల్లాలో నారా లోకేశ్ (కమ్మ), పత్తిపాటి పుల్లారావు (కమ్మ), ధూళిపాళ్ల నరేంద్ర (కమ్మ), గల్లా మాధవి (కమ్మ), కన్నా లక్ష్మీనారాయణ (కాపు), నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ (ఎస్సీ), ప్రకాశం జిల్లాలో ఏలూరు సాంబశివరావు (కమ్మ), గొట్టిపాటి రవికుమార్ (కమ్మ), డోలా బాల వీరాంజనేయస్వామి (ఎస్సీ), నెల్లూరు జిల్లాలో పి.నారాయణ (కాపు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (రెడ్డి), ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (రెడ్డి) రేసులో ఉన్నారు.
కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి రెడ్డి (రెడ్డి), రాంభూపాల్ రెడ్డి (రెడ్డి), కర్నూలు జిల్లా నుంచి ఎన్ఎండి ఫరూక్ (మైనారిటీ), టీజీ భరత్ (ఆర్యవైశ్య), భూమా అఖిల ప్రియా (రెడ్డి), అనంతపురం నుంచి పరిటాల సునీత (కమ్మ), పయ్యావుల కేశవ్ (కమ్మ), పల్లె సింధూర రెడ్డి (రెడ్డి), కలువ శ్రీనివాసులు (బీసీ), చిత్తూరు జిల్లాలో ఎన్.అమర్ నాథ్ రెడ్డి (రెడ్డి), నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (రెడ్డి) పేర్లు మంత్రి పదవులకు వినిపిస్తున్నాయి.
జనసేన, బీజేపీ నుంచి రేసులో ఉన్నవారు
పవన్ కల్యాణ్ (కాపు), నాదెండ్ల మనోహర్ (కమ్మ), కొణతాల రామకృష్ణ (బీసీ), దేవ వరప్రసాద్ (ఎస్సీ), బొలిశెట్టి శ్రీనివాస్ (కాపు) పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి (కమ్మ), సత్య కుమార్ (బీసీ), విష్ణు కుమార్ రాజు (క్షత్రియ) మంత్రి పదవులకు రేసులో ఉన్నారు.
అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న సీనియర్లకు మంత్రి పదవులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. సామాజిక కూర్పు, జిల్లాల పరిధి నేపథ్యంలో కొంతమందికి మంత్రి పదవులు రాకపోవచ్చు. గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులకు మంత్రి పదవులు రాకపోవచ్చు. మళ్లీ మంత్రి వర్గ విస్తరణలో వాళ్లకు అవకాశం ఉండొచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్