TG New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్- త్వరలోనే జారీ, అప్పట్నుంచీ సన్నబియ్యం పంపిణీ

Best Web Hosting Provider In India 2024


TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటన చేశారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ, పింఛన్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర ప్రభుత్వ పథకాలు ముడిపడి ఉన్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూడు నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. దీంతో సామాన్యులకు డబ్బు ఆదా అవుతుందన్నారు.

అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు

అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించామని, విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుదారులకు 3 నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈలోపు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తామన్నారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు మంత్రి వర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈకేవైసీకి చివరి తేదీ జూన్ 30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను పేద, మధ్యతరగతి వారే లక్ష్యంగా అమలు చేస్తారు. సంక్షేమ పథకాల అర్హులను రేషన్ కార్డుదారుల ఆధారంగా గుర్తిస్తారు. సంక్షేమ పథకాలతో పాటు విద్యా, వైద్య సేవలకు రేషన్ కార్డు చాలా ముఖ్యం. దీంతో అర్హులు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తుంటారు. తెలంగాణ గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వలేదు. దీంతో అర్హులై ఉండి కూడా చాలా మంది సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాపాలన ద్వారా అర్హుల నుంచి సమాచారం సేకరించిన విషయం తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు ఈ-కైవీసీ తప్పనిసరి చేసింది కేంద్రం. జూన్ 30తో ఈ కేవైసీ గడువు ముగుస్తుంది. ఇప్పటికే ఈ-కేవైసీకి గడువును చాలా సార్లు పొడగిస్తూ వచ్చింది కేంద్రం. ఈ కేవైసీ పూర్తిచేయకపోతే రేషన్ సరుకులు నిలిపివేస్తారు.

ఆధార్ కేంద్రాల వద్ద క్యూ

సాంకేతిక కారణాల వల్ల రేషన్ కేంద్రాల్లో చాలా మంది ఈకేవైసీలో సమస్యలు వస్తున్నాయి. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడమే ఈ సమస్యలు వస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు. ఏడు నెలలుగా రాష్ట్రంలో ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టినా ఇంకా 100 శాతం పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. ఆధార్ సమస్యల వల్ల కేవైసీ అప్ డేట్ ఆలస్యం ఉందని, జనాలు ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండడంతో జనాలు ఈ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

Ration CardsTelangana NewsUttam Kumar ReddyGovernment Of TelanganaHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024