Best Web Hosting Provider In India 2024
ఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ అన్నారు. సంస్కరణల అమలులో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో మంత్రి అమర్‌నాథ్ పాల్గొని మాట్లాడారు. సింగిల్ డెస్క్ ద్వారా పరిశ్రమలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని, త్వరలోనే కొత్త పాలసీలతో ముందుకు వస్తున్నట్టు చెప్పారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిచ్చేలా పాలసీల రూపకల్పన చేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్ తెలిపారు.