Chandini Chowdary: ప్రతీదానికి ఏజ్ లిమిట్.. నిరుత్సాహ పర్చేవారే ఎక్కువ: గామి హీరోయిన్ చాందినీ చౌదరి

Best Web Hosting Provider In India 2024


Chandini Chowdary Music Shop Murthy Pre Release Event: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది గామి హీరోయిన్ చాందినీ చౌదరి. ఆమె చేతిలో ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు, యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలు ఉన్నాయి. వీటిలో యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు జూన్ 14న అంటే ఇవాళ విడుదల కానున్నాయి.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో పుష్ప విలన్ అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించారు. ఫ్లై హై సినిమాస్‌ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బేబి దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాందినీ చౌదరి ఆసక్తికర విశేషాలు చెప్పింది. “మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సాయి రాజేష్ గారికి, ధీరజ్ గారికి థాంక్స్. ప్రతీ మనిషికి ఆశలు, ఆశయాలుంటాయి. కొన్ని చిన్నప్పుడే తెలుస్తాయి. కొన్ని రియాల్టీకి దగ్గరగా ఉంటాయి. ఇంకొన్ని రియాల్టీకి దూరంగా ఉంటాయి. అలాంటి ఆశలు, ఆశయాలతో ఉండే ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది” అని చాందినీ చౌదరి తెలిపింది.

“కల కనడానికి ఓ వయసంటూ ఉండదు. సమాజంలో ప్రతీ ఒక్క దానికి ఏజ్ లిమిట్ పెడతారు. నిరుత్సాహ పరిచే వారే ఎక్కువగా ఉంటారు. చాలా మంది కాంప్రమైజ్ అవుతారు. ఓ లక్ష్యం, కల కనడానికి వయసుతో సంబంధం లేదని చెప్పడమే మా సినిమా ఉద్దేశం. పది, పన్నెండేళ్ల క్రితం నేను హీరోయిన్ అవుదామని అనుకున్నా. చాలా మంది నవ్వారు. నేను కూడా నవ్వుకున్న రోజులున్నాయి. కానీ కట్ చేస్తే.. ఒకే రోజు నా రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి” అని చాందినీ చౌదరి చెప్పుకొచ్చింది.

“ఇలాంటి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. వంద మంది ఈ మూవీని చూసి మూర్తిలా ఒక్కరు ఆలోచించినా మాకు విజయం వచ్చినట్టే. జూన్ 14న మా చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడండి. అందరికీ నచ్చేలా ఉంటుంది” అని చాందినీ చౌదరి పేర్కొంది.

అతిథిగా వచ్చిన బేబి డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. “ఓవర్సీస్‌లో మా బేబీ సినిమాను హర్ష గారు రిలీజ్ చేశారు. ఆయనకున్న కాన్ఫిడెన్స్‌తోనే మా చిత్రం బయటకు వచ్చింది. ఇది హర్ష గారి సినిమా అని నాకు ముందుగా తెలియదు. మనసుతో, ఇష్టంతో, ప్రేమతో ఈ సినిమాను దర్శకుడు తీశాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది” అని చెప్పారు.

“పవన్ గారి సంగీతం నాకు చాలా ఇష్టం. శ్రీనివాస్ గారు చక్కగా చూపించారు. చాందినీ గారు అద్భుతమైన నటి. ఈ చిత్రంతో ఆమెకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అజయ్ ఘోష్‌కు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. ఎలాంటి పాత్రైనా ఆయన నటించగలరు. ఈ టీంకు మంచి బ్రేక్ రావాలి. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి” అని సాయి రాజేష్ కోరారు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024