విద్యారంగ పురోగతికి వైయ‌స్‌ జగన్‌ మార్గదర్శకుడు

Best Web Hosting Provider In India 2024

గుంటూరు: ‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్ ఉజిసిక్‌ మంత్రముగ్ధులయ్యారు. నేను ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలలో పర్యటించా. కానీ ఏ దేశంలో లేని అనుభూతి, ప్రత్యేకతను నేను గుంటూరులో పొందానని చెప్పారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ ఉజిసిక్ సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు లక్ష్యసాధన, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముఖాముఖీగా మాట్లాడారు. ఆ తర్వాత సాయంత్రం బీఆర్‌ స్టేడియంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతో పాటు నగరంలోని వివిధ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన వేలాది మంది టెన్త్‌ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు, చేపడుతున్న కార్యక్రమాలపై మరోమారు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో అంకితభావం ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండటం అభినందనీయమంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌­కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

Best Web Hosting Provider In India 2024

అది నా అదృష్టంగా భావిస్తున్నా.. ప్రపంచంలో ఎంతోమంది నన్ను హీరో అని పిలిచి ఉండవచ్చు.. కానీ, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇక్కడ పొందాను. వెలకట్టలేని విద్యకు, విజ్ఞానానికి అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో మంచి పాలకుడు మీకు ఉన్నారు. అంకితభావం ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. గుంటూరు ప్రాంతం విజ్ఞానం, విద్య పరంగా ఎంతో సామర్థ్యం ఉన్న ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలిశాను. కానీ ఆంధ్రప్రదేశ్‌ సీఎంతో కలవబోవడం ఎంతో ప్రత్యేకానుభూతిగా ఉంది’.. అంటూ నిక్‌ తన అనుభూతిని పంచు­కు­న్నారు.
నిక్ ఉజిసిక్‌​ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 

ఇది సామాన్యమైన విషయం కాదు..
ఏపీలోని ప్రభుత్వ, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు నేను మాట్లాడిన ఫారిన్‌ ఇంగ్లిష్‌ భాషాశైలిని అర్థంచేసుకుని, అంతేస్థాయిలో ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడిన తీరు ఎంతో అద్భుతం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత గొప్పగా ఉంటాయని నేను ఊహించలేదు. కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో ఒక  ప్రభుత్వ పాఠశాల సకల హంగులతో ఉండటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులను ఇంత గొప్ప ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడం సామాన్య విషయం కాదు.

నా జీవితగాధపై పాఠ్యాంశమా!?
రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 10వ తరగతి ఇంగ్లిషు టెక్ట్స్‌బుక్‌లోని మొదటి పాఠ్యాంశంగా ఉన్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో ‘ఆటిట్యూడ్‌ ఆల్టిట్యూడ్‌’ పేరుతో తన జీవితగాధను ముద్రించడం ఆశ్చర్యకరం. పాఠ్యాంశంగా నాకు చోటు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మీ పాఠ్య పుస్తకంలో రాసిన నా జీవితం గురించి చదివారా? (మీ గురించి చదివామని విద్యార్థులు చెప్పగా, ఆయన ఆంతులేని ఆనందానికి లోనయ్యారు.)

Best Web Hosting Provider In India 2024

నాడు–నేడుతో పాఠశాల రూపం మార్చేశారు..
నిక్ ఉజిసిక్‌తో టెన్త్‌ విద్యార్థిని సాజిదా మాట్లా­డుతూ.. ‘నేను చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశా­లలోనే చదువుతున్నాను. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన చలువతో మా పాఠశాలలో అన్ని రకాల వసతులతో చదువుకుంటున్నాం. జగనన్న విద్యాకానుక కిట్లు, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియంతో నేను ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన మీతో ఆంగ్లంలో ఇలా మాట్లా­డగలుగుతున్నాను.. వైయ‌స్‌ జగన్‌ కల్పిస్తున్న అవ­కాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాను’. (ఆత్మవిశ్వాసంతో సాజిదా చెప్పిన మాటలకు నిక్‌ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.)

నాడు–నేడుతో ‘కార్పొరేట్‌’ను తలదన్నేలా..
మరో విద్యార్థిని డి. శిరీష మాట్లాడుతూ.. ‘ఇంగ్లిష్‌ టెక్ట్స్‌బుక్‌లో మీ బయోగ్రఫీ చదివి స్ఫూర్తి పొందా. ప్రపంచం మెచ్చే మోటివేషనల్‌ స్పీకర్‌గా ఎదిగిన తీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాడు–నేడుకు ముందు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. సరిపడా తరగతి గదుల్లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే, జగన్‌ మావయ్య సీఎం అయిన తరువాత నాడు–నేడు ద్వారా కల్పించిన వసతులతో మేం కార్పొరేట్‌ పాఠశాలలను మించిన స్థాయిలో ఆధునిక తరగతి గదులు, నూతన ఫర్నిచర్‌పై కూర్చుని తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్‌ లైట్ల మధ్య ఏకాగ్రతతో చదువుకునేందుకు అవకాశం కలిగింది. జగనన్న విద్యాకానుక కిట్‌తో ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పొందడంతో పాటు 8వ తరగతిలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో నాణ్యమైన బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేసిన తీరు అద్భుతం’.. అంటూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శిరీష నిక్‌ దృష్టికి తెచ్చింది.

దేశంలోనే బెస్ట్‌ సీఎం వైయ‌స్‌ జగన్‌
ఇక సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎంతో విజన్‌ కలిగిన నాయకునిగా దేశంలోనే బెస్ట్‌ సీఎంగా నిలిచారని  నిక్ ఉజిసిక్‌ అభివర్ణించారు. ఆ తర్వాత వేణుగోపాల్‌నగర్‌లోని కోన బాల ప్రభాకరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్‌ టీచర్‌ పుష్ప స్వయంగా గీసిన నిక్‌ చిత్రాన్ని ఆయనకు బçహూకరించగా ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సీఎంసలహాదారు ఆర్‌. ధనుంజయరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *